అత్యవసర సమయాల్లో ప్రాణాలు నిలబెట్టే 108 వాహనాల్లో ఆక్సిజన్, వైద్య పరికరాలు, మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 108 అత్యవసర సేవల విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించవద్దన్నారు. ఏమైనా సమస్యలుంటే సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిధుల విడుదల విషయంలో జాప్యాన్ని నివారిస్తామని, నిధులకు సంబంధించి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు.
108 వాహనాల నిర్వహణలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు జిల్లా స్థాయిలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వాహనాల రిపేర్కు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలోనే విడిభాగాలు అందుబాటులో వుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. శాఖాపరమైన నిర్వహణకు నిధులు విడుదలకు ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు రివాల్వింగ్ ఫండ్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కనీసం మూడు నెలలకు సరిపడా నిధుల్ని ముందే అందుబాటులో ఉంచుకుని అత్యవసర సర్వీసులకు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చదవండి : బెట్టింగ్ వ్యవహారం...ఆసుపత్రిపై అగంతకులు దాడి