ఇది కూడా చదవండి....
కాపాడటానికి వెళితే తిరగబడ్డ ఎలుగుబంటి - dadi
అటవీశాఖ సిబ్బందిపై ఎలుగుబంటి దాడి చేసింది. కర్నూలు జిల్లాలోని వెలుగోడు జలాశయంలో ప్రమాదవశాత్తూ ఓ భల్లూకం పడిపోయింది. ఇది గమనించిన అటవీశాఖ సిబ్బంది కాపాడే ప్రయత్నం చేశారు. అంతే అందర్నీ పరిగెత్తించింది.
అటవీశాఖ సిబ్బందిపై ఎలుగుబంటి దాడి
అటవీశాఖ సిబ్బందిపై ఎలుగుబంటి దాడి చేసింది. కర్నూలు జిల్లాలోని వెలుగోడు జలాశయంలో ప్రమాదవశాత్తూ ఓ భల్లూకం పడిపోయింది. ఇది గమనించిన అటవీశాఖ సిబ్బంది కాపాడే ప్రయత్నం చేశారు. నీటిలో పడిన మృగాన్ని వల సాయంతో బయటకు తీసే ప్రయత్నం చేశారు అధికారులు. కొంత దూరం వచ్చే వరకు బాగానే ఉంది. గుమిగూడిన జనాన్ని చూసి భయపడిన ఎలుగు... తప్పించుకునేందుకు అధికారులపైకి దూకింది. అప్పుడు భయంతో అధికారులు పరుగులు పెట్టారు.ఈ క్రమంలోనే ప్రొటెక్షన్ వాచర్ విజయ్ కుమార్ కిందపడిపోయారు. నీటిలో పడిపోయి ఎటూ కదల్లేకపోయారు. క్రూర మృగానికిదొరికిపోయారు. నీటిలోనే అతనిపై దాడి చేసిన భల్లూకం... తీవ్రంగా గాయపరిచింది. చుట్టుపక్కల ఉన్న ప్రజలు... అప్రమత్తమై... కేకలు వేసి... ఎలుగుబంటిని భయపెట్టి పారిపోయేలా చేశారు.ప్రమాదంలో గాయపడిన విజయ్ కుమార్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలు సర్వజనాసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి....
Intro:శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో ఉదయం 8 గంటల నుంచి ఉత్సాహంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. సెల్ ఫోన్ లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించ లేదు. మొత్తం 292 ఓట్లు ఉండగా వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు పోలింగ్ కేంద్రానికి నిర్ణీత దూరంలో ఓటరు జాబితా లతో శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు.
Body:టెక్కలి
Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
Body:టెక్కలి
Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
Last Updated : Mar 22, 2019, 1:07 PM IST