కెన్యాలో కూలిన విమానం...ఐదుగురు మృతి పశ్చిమ కెన్యాలోని కామ్వింగిలో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో కెన్యాకు చెందిన పైలట్‌తో పాటు నలుగురు పర్యటకులు మరణించారు. మృతుల్లో ముగ్గురిని అమెరికన్లుగా గుర్తించారు పోలీసులు. వారి కుటుంబాలకు సమాచారమిచ్చాక వివరాలు వెల్లడిస్తామని అధికారులు ప్రకటించారు.