ETV Bharat / briefs

10 రోజులుగా విద్యుత్ లేదు.. ఎవరూ పట్టించుకోరా? - విద్యుత్ కోతలు

గత పది రోజులుగా తమ గ్రామానికి విద్యుత్తు సరఫరా లేదని కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈదులదేవరబండ ఉపకేంద్రం వద్ద ధర్నాచేపట్టారు.

విద్యుత్తు కోతలపై గ్రామస్థుల ధర్నా
author img

By

Published : Jul 1, 2019, 10:55 AM IST

Updated : Jul 1, 2019, 12:01 PM IST

విద్యుత్తు కోతలపై గ్రామస్థుల ధర్నా

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ఈదుల దేవరబండ విద్యుత్తు ఉప కేంద్రం వద్ద కప్పట్రాళ్ల గ్రామస్థులు ధర్నా చేపట్టారు. గత పది రోజులుగా గ్రామంలో విద్యుత్తు సరఫరా సరిగా లేదని రోడ్డుపై బైఠాయించారు. పంటలకు నీరు అందడం లేదని వాపోయారు. సమస్యను పరిష్కరించాలని పదేపదే విన్నవించుకున్నా అధికారులు స్పందించలేదని ఆరోపించారు. గ్రామస్థుల ధర్నాతో కర్నూలు - బళ్లారి మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండి : తాడేపల్లిలో యాగం.. హాజరుకానున్న సీఎం

విద్యుత్తు కోతలపై గ్రామస్థుల ధర్నా

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ఈదుల దేవరబండ విద్యుత్తు ఉప కేంద్రం వద్ద కప్పట్రాళ్ల గ్రామస్థులు ధర్నా చేపట్టారు. గత పది రోజులుగా గ్రామంలో విద్యుత్తు సరఫరా సరిగా లేదని రోడ్డుపై బైఠాయించారు. పంటలకు నీరు అందడం లేదని వాపోయారు. సమస్యను పరిష్కరించాలని పదేపదే విన్నవించుకున్నా అధికారులు స్పందించలేదని ఆరోపించారు. గ్రామస్థుల ధర్నాతో కర్నూలు - బళ్లారి మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండి : తాడేపల్లిలో యాగం.. హాజరుకానున్న సీఎం

Intro:ap_tpt_51_28_caste_murder_avb_ap10105

రాక్షసులు అని కూడా అనలేమేమో
* కులాంతర వివాహం చేసుకుందన్న కక్షతో కన్నకూతురినే హత్య చేసిన ఆమె తల్లిదండ్రులు



Body:కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో కక్ష పెంచుకున్న ఆమె తల్లిదండ్రులు వివాహమైన రెండున్నర ఏళ్ల తర్వాత ప్రసవం అనంతరం అత్తవారింటికి వచ్చిన ఆమెను పచ్చి బాలింతరాలు అని కూడా చూడకుండా బలవంతంగా ద్విచక్ర వాహనంలో ఎక్కించుకుని మామిడి తోటల్లోకి తీసుకెళ్లి గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అంతటితో ఆగకుండా ఆమె మృతదేహానికి కాళ్లు చేతులు కట్టేసి ఈడ్చుకుంటూ వచ్చి సమీపంలోని బావిలో పడేశారు ఈ దారుణమైన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ఊసర పెంట గ్రామంలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన భాస్కర్ నాయుడు, వరలక్ష్మిల కుమార్తె హేమావతి(23) అదే గ్రామానికి చెందిన గోవిందయ్యా, శోకమ్మ కుమారుడు కేశవ రెండున్నరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా కేశవం ఎస్సి కులానికి చెందినవారు కావడంతో కమ్మ కులానికి చెందిన అమ్మాయి తల్లిదండ్రులు వారిపై కోపంతో పలుమార్లు బెదిరింపులకు దాడులకు పాల్పడ్డారు. వీరి బెదిరింపులతో భయపడ్డ దంపతులు రెండున్నరేళ్లుగా గ్రామంలో కాకుండా బయట పలు ప్రాంతాలలో నివాసం ఉంటూ వచ్చారు. ఈ మధ్య ఆ అమ్మాయి గర్భందాల్చి నెలలు నిండడంతో ప్రసవం కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో పండంటి మగబిడ్డను ప్రసవించిన హేమావతి ని భర్త కేశవం తన ఇంటికి తీసుకెళ్లాడు. శుక్రవారం బిడ్డకు ఒంట్లో నలతగా ఉండటం తో పలమనేరు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకొని ఇంటికి వెళ్తుండగా దారిలో అప్పటికే కాచి ఉన్న అమ్మాయి తల్లిదండ్రులు ఆమె సోదరులు, సోదరి ఒక్కసారిగా అమ్మాయి భర్త కేశవన్, ఆమె అత్త శోకమ్మ పై దాడి చేసి అమ్మాయిని బలవంతంగా ద్విచక్ర వాహనం ఎక్కించుకొని తీసుకెళ్లారు. అడ్డదారుల్లో పొలాల్లోకి వెళ్లి మామిడి తోటలో ఆమె గొంతుకు తాడు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం మృత దేహాన్ని సమీపంలోని బావిలో పడేసి పరారయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అదనపు బలగాలను దించారు. అలాగే పలమనేరు డిఎస్పి యుగంధర్ బాబు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి ని అదుపు చేశారు. మృతురాలి భర్త కేశవన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పరారైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491
Last Updated : Jul 1, 2019, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.