ఇవి కూడా చదవండి:నూటికి నూరు పాళ్లు...సేవ చేసుకుంటాం!
హోదాపై కేసీఆర్తో కలిసి జగన్ నీఛ రాజకీయాలు! - yvb rajendra prasad
కేసీఆర్తో కలిసి జగన్ నీఛ రాజకీయాలు చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ విమర్శించారు. ప్రత్యేక హోదాపై వ్యతిరేకంగా తెరాస నేతలు మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు. పోలవరానికి వ్యతిరేకంగా తెరాస నాయకులు కేసులు వేశారని గుర్తు చేశారు.
తెదేపా ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్
రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు అడుగడుగునా అడ్డుపడుతున్న కేసీఆర్తో కలిసి.. వైకాపా అధ్యక్షుడుజగన్ నీఛ రాజకీయాలు చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.సోనియాగాంధీ తెలంగాణ వచ్చి హోదాపై మాట్లాడితే... కేసీఆర్ హెచ్చరించలేదా అని రాజేంద్రప్రసాద్.. జగన్ను ప్రశ్నించారు. విభజన హామీలన్నీ కాంగ్రెస్ నెరవేరుస్తుందని చెబితే కేసీఆర్ విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా తెరాస నేతలు మాట్లాడిన వీడియో ప్రదర్శించారు. పోలవరానికి వ్యతిరేకంగా తెరాస నాయకులు కేసులు వేశారన్న వైవీబీ... కేసుల మాఫీ కోసం మోదీతో జగన్ కుమ్మక్కయ్యారని అన్నారు.కేసీఆర్ నుంచి వెయ్యి కోట్లు తీసుకుని జగన్... తెరాసకు అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రావాళ్లపై కేసీఆర్ చేసిన విమర్శలు మరచిపోయారా అని జగన్ను రాజేంద్రప్రసాద్ నిలదీశారు. ఎన్నికల్లో ప్రజలే జగన్, కేసీఆర్, మోదీకి బుద్ధి చెబుతారన్నారు.
ఇవి కూడా చదవండి:నూటికి నూరు పాళ్లు...సేవ చేసుకుంటాం!
TAGGED:
yvb rajendra prasad