అనంతపురం జిల్లా కణేకల్లు మండలం గెనిగర క్రాస్ రోడ్డు వద్ద ఓ పోలీస్ ఇన్ఫార్మర్ దారుణ హత్యకు గురయ్యాడు. బళ్లారికి చెందిన గంగన్న పోలీస్లకు గూఢాచారిగా వ్యవహరించేవాడు. ఇవాళ వ్యాపార నిమిత్తం యర్రగుంటకు వెళ్లి తిరిగి వస్తుండగా..గుర్తుతెలియని వ్యక్తులు కొడవళ్లు, కత్తులతో దాడి చేసి...బండరాయితో మోది చంపేశారు. ఈ హత్య వ్యాపార లావాదేవిల కారణంతోనా..లేక ఇన్ఫార్మర్గా ఉన్నందుకు చంపారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..గొడవ చిన్నదే.. తాగిన మత్తులో చంపేశారట!