ఈయన విశ్వేశానంద. హోమగుండంపై పదునైన మేకులు ఏర్పాటు చేసి... వాటిపై కూర్చుని తపస్సు చేస్తున్నారు. బాబా గురించి తెలిసిన యాత్రికులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చూడటానికి తరలివస్తున్నారు.
చిన్నతనం నుంచే దైవభక్తిలో లీనమయ్యానని, తాను కూర్చుంటున్న హోమ గుండం జీవింతాంతం వెలుగుతూనే ఉంటుందని తెలిపారు స్వామి విశ్వేశానంద గిరి. దేశం ప్రశాంతంగా ఉండాలని, అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు.
"దేశంలో ధర్మంపై దాడి జరుగుతోంది. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, ఏ దళమైనా... ధర్మాన్ని మోసం చేస్తున్నారు. వీరు దేవుని ఆదేశాలను అంగీకరించట్లేదు. రాజకీయ నాయకుల ఆదేశాలనే పట్టించుకుంటున్నారు."
---- స్వామి విశ్వేశానంద, హోమగుండం బాబా