ETV Bharat / briefs

హైటెక్ సిటీకి మెట్రో పరుగు మొదలైంది

సాఫ్ట్​వేర్ నిపుణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమీర్​పేట​- హైటెక్​సిటీ మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. ఈ సేవలతో మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో పనిచేసే సాఫ్ట్​వేర్, ఇతర కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు ట్రాఫిక్ నుంచి ఈ మార్గంతో ఊరట లభించనుంది.

హైటెక్ సిటీకి మెట్రో పరుగు మొదలైంది
author img

By

Published : Mar 20, 2019, 2:17 PM IST

హైటెక్ సిటీకి మెట్రో పరుగు మొదలైంది
హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులో నేడు మరో కీలక అడుగు పడింది. గ్రేటర్‌ ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్న హైటెక్ సిటీ మెట్రో రైలు నేటి నుంచి దూసుకెళ్తుంది. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ఉదయం 9.33 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ జెండా ఊపి హైటెక్‌ సిటీకి తొలి మెట్రో రైలుప్రారంభించారు.సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణాలు మొదలుకానున్నాయి.వాటి ద్వారా 18 నిమిషాల్లో అమీర్‌పేట నుంచి హైటెక్‌ సిటీ చేరుకోవచ్చు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున ప్రారంభ కార్యక్రమం హడావుడి లేకుండా ప్రశాంతంగా సాగింది.

అమీర్‌పేట, హైటెక్ సిటీ దారికి ఉన్న డిమాండ్, వచ్చే క్రేజే వేరు.జూబ్లీ చెక్‌పోస్ట్‌ నుంచి సింగిల్‌ ట్రాక్‌లో మెట్రోరైలు హైటెక్‌సిటీ వరకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి వెనక్కి వస్తుంది. నాగోల్‌ నుంచీ హైటెక్‌ సిటీకి మెట్రోలో 55 నిమిషాల్లో వెళ్లొచ్చు. అదే రోడ్డు మార్గంలో వెళ్లాలంటే... ట్రాఫిక్ వల్ల దాదాపు 2 గంటలు పడుతుంది. మెట్రో ట్రైన్ వల్ల ట్రాఫిక్ జామ్ కొంతైనా తగ్గే అవకాశాలున్నాయి.

10 కిలోమీటర్ల దూరం:

ఈ మార్గంలోని రైళ్లు అమీర్​పేట నుంచి మధురానగర్, యూసఫ్​గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5, చెక్ పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు మీదుగా హైటెక్ సిటీకి చేరుకుంటాయి. ఈ 2 స్టేషన్​ల మధ్య 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

9 నుంచి 12 నిమిషాల మధ్య:

అమీర్​పేట్ నుంచి హైటెక్ సిటీకి 18 నిమిషాల్లో చేరుకోవచ్చు. మిగతా మార్గాల్లో 4 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటే ఈ మార్గంలో మాత్రం ప్రతి 9 నుంచి 12 నిమిషాల మధ్య ఒక రైలు సేవలందించనుంది. హైటెక్ సిటీ వద్ద రివర్సల్ పనులు పూర్తైన తర్వాత మిగతా మార్గాల మాదిరిగానే 4 నిమిషాలకు ఒక రైలు సదుపాయం కల్పిస్తామని మెట్రోవర్గాలు తెలిపాయి. నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్లాల్సిన ప్రయాణికులు ఒకే రైల్లో ప్రయాణించవచ్చు. ఎల్​బీ నగర్, మియాపూర్ నుంచి వెళ్లాల్సిన వాళ్లు మాత్రం అమీర్​పేట్​లో రైలు మారాల్సి ఉంటుంది. మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో పనిచేసే సాఫ్ట్​వేర్, ఇతర కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు ట్రాఫిక్ నుంచి ఊరట లభించనుంది.

56 కిలోమీటర్లకు చేరిన మెట్రో మార్గం

హైదరాబాద్​లో మూడు కారిడార్లలో మెట్రో సేవలు అందుతున్నాయి. 29 కిలోమీటర్ల మియాపూర్ - ఎల్​బీనగర్, 17 కిలోమీటర్ల నాగోల్ - అమీర్​పేట మార్గాల్లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 10 కిలోమీటర్ల అమీర్ పేట - హైటెక్​సిటీ మార్గంలో సేవలు మొదలయినందున మొత్తం 56 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.