ETV Bharat / briefs

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కాప్రా, సైనిక్‌పురి, ఈసీఐఎల్‌లో మోస్తరు వర్షం పడింది. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

author img

By

Published : Jun 25, 2019, 7:47 PM IST

Updated : Jun 25, 2019, 8:03 PM IST

హైదరాబాద్​లోని పలుప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్​లోని పలుప్రాంతాల్లో వర్షం

గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కాప్రా, సైనిక్‌పురి, ఈసీఐఎల్‌, జీడిమెట్ల, సురారం, కొంపల్లి, సుచిత్రలో మోస్తరు వర్షం పడింది. అంబర్‌పేట, తిరుమలనగర్‌ రహదారిపై చెట్టు విరిగిపడి ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్​ఎంసీ సిబ్బంది రహదారులపై నీరు నిలువకుండా చర్యలు చేపడుతున్నారు.

కాలనీలోకి నీరు
గచ్చిబౌలి ఖాజాగూడలోని సాయి వైభవ్ కాలనీలోకి వరద నీరు వచ్చి చేరడం వల్ల కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఖాజాగూడా పెద్ద చెరువు నుంచి వస్తున్న వరద నీరు కాలనీలోకి చేరింది.

ఇవీ చూడండి: చంద్రబాబు కుటుంబానికి భద్రత కుదింపు

Last Updated : Jun 25, 2019, 8:03 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.