ETV Bharat / briefs

గుడ్డసంచి... ఇది పర్యావరణహిత వాయినం

ఆ దంపతులకు ప్రకృతంటే ప్రాణం.. వాళ్ల ఇంటిని చూస్తే సహజత్వం ఉట్టి పడుతుంది. 14 ఏళ్లుగా పాలిథీన్‌ కవర్‌ వాడకుండా... నిత్యవసరాలు తీర్చుకుంటున్నారు. పుట్టినరోజు వేడుకైనా... శుభకార్యానికైనా.. వాళ్లు వెళ్తే మాత్రం గుడ్డ సంచిని బహుమతిగా ఇస్తారు.

గుడ్డసంచి... ఇది పర్యావరణహిత వాయినం
author img

By

Published : Apr 28, 2019, 1:06 PM IST

ఏదైనా నేరుగా చెబితే పట్టించుకోరు. అదే సంప్రదాయాలు, ఆచారాలతో ముడిపెట్టి చెబితే... కచ్చితంగా పాటిస్తారు. ఇదే పద్ధతిని అమలు చేస్తూ పాలిథీన్ కవర్లపై సమరం చేస్తున్నారు హైదరాబాద్​లోని ఓ దంపతులు. 14 ఏళ్లుగా పాలిథీన్ కవర్ వాడకుండానే.. నిత్యవసరాలు తీర్చుకుంటున్నారు. అతిథులకూ వాయినంగా గుడ్డ సంచినే ఇస్తున్నారు. పాలిథీన్​ వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు.

గుడ్డసంచి... ఇది పర్యావరణహిత వాయినం

ఇల్లే ఓ ప్రకృతి నిలయం

తెలంగాణలోని హైదరాబాద్ ఏఎస్​ రావు నగర్​లో నివాసముంటున్న పైడిమర్రి చంద్రశేఖర్-అపర్ణ దంపతులకు ప్రకృతి అంటే ప్రాణం. ఆ ఇష్టంతోనే ఇంటిని సహజత్వానికి దగ్గరగా ఉండేలా తీర్చిదిద్దుకున్నారు. ఇంట్లో అడుగుపెట్టగానే గుమ్మానికి వేలాడుతున్న వరి కంకులు స్వాగతం పలుకుతాయి. వెల్లుల్లి వెల్​కమ్ చెబుతుంది. ఇత్తడి బిందెలు ఆప్యాయంగా పలకరిస్తాయి. ఇంట్లోని వస్తువులన్నీ పాతరోజులను గుర్తుకు తెస్తాయి.

గుడ్డ సంచే బహుమతి

పర్యావరణానికి విఘాతంగా మారిన ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయాలని నిర్ణయించుకున్నారు చంద్రశేఖర్​ దంపతులు. 14 ఏళ్లుగా గుడ్డ సంచులనే వినియోగిస్తున్నారు. పాలిథీన్ కవర్లపై ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఇందుకోసం భారతీయ సంప్రదాయాన్నే ఎంచుకున్నారు. బంధువులు, అతిథులకు వాయినంలో వస్త్రాలకు బదులు చేతి సంచిని ఇస్తున్నారు. పుట్టిన రోజు వేడుకలైనా.. శుభకార్యమైనా... గుడ్డ సంచినే బహుమతిగా ఇస్తారు. పాలిథీన్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తారు.

ఈ ఉద్యమానికి కాలనీవాసుల మద్దతూ లభిస్తోంది. వాళ్లూ వాయినంగా సంచులే ఇస్తున్నారు. చంద్రశేఖర్​ దంపతుల ఉద్యమం పాలిథీన్ సంచులతోనే ముగిసిపోలేదు. ఇంటి ఆవరణలోనే ఘన వ్యర్థాల నిర్వహణ ప్రదేశాన్ని ఏర్పాటు చేసి... ఎరువుగా మలుస్తున్నారు. ఏడాది నుంచి ఎలాంటి వ్యర్థాలు లేకపోవడం వల్ల జీహెచ్ఎంసీ సిబ్బంది ఈ ఇంటివైపు కన్నెత్తి చూడలేదు.

ఆదర్శంగా నిలుస్తున్న దంపతులు

ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసిన చంద్రశేఖర్...రాజీనామా చేసి బాధ్యత ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థ స్థాపించారు. భార్యభర్తలిద్దరూ పర్యావరణహిత కార్యక్రమాలు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలకు వారసత్వంగా ఆస్తులు, అంతస్తుల కంటే... భవిష్యత్​ను బంగారుమయం చేసే చక్కటి పర్యావరణం అందిద్దామని పిలుపునిస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇదీ చూడండి: మీది ప్రేమేనా... ఓ సారి ఆలోచించుకోండి!

Intro:యాదాద్రి భువనగిరి జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మార్కెట్ యార్డ్ లో ధాన్యం మొలకెత్తింది. ఆరుగాలం శ్రమించిన పంట నీటిలో కొట్టుకు పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సమయానికి కొనుగోలు చేయకపోవడం వల్ల పంట నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని చౌటుప్పల్,వలిగొండ రామన్నపేట, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో మార్కెట్ యార్డ్ లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. టార్పాలిన్ పట్టలు అందుబాటులో లేకపోవడంతో వర్షంలో ధాన్యం కొట్టుకుపోయింది.

Body:యాదాద్రి భువనగిరి జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మార్కెట్ యార్డ్ లో ధాన్యం మొలకెత్తింది. ఆరుగాలం శ్రమించిన పంట నీటిలో కొట్టుకు పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సమయానికి కొనుగోలు చేయకపోవడం వల్ల పంట నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని చౌటుప్పల్,వలిగొండ రామన్నపేట, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో మార్కెట్ యార్డ్ లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. టార్పాలిన్ పట్టలు అందుబాటులో లేకపోవడంతో వర్షంలో ధాన్యం కొట్టుకుపోయింది.

Conclusion:యాదాద్రి భువనగిరి జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మార్కెట్ యార్డ్ లో ధాన్యం మొలకెత్తింది. ఆరుగాలం శ్రమించిన పంట నీటిలో కొట్టుకు పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సమయానికి కొనుగోలు చేయకపోవడం వల్ల పంట నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని చౌటుప్పల్,వలిగొండ రామన్నపేట, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో మార్కెట్ యార్డ్ లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. టార్పాలిన్ పట్టలు అందుబాటులో లేకపోవడంతో వర్షంలో ధాన్యం కొట్టుకుపోయింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.