సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకూ 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీలు, నాయకులు సహకరించాలని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా విజ్ఞప్తి చేశారు. పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. దశల వారీగా.. ఎన్నికలు, ఫలితాల వెల్లడి తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.
దశ | ఎన్నికల తేదీ |
మొదటి దశ | ఏప్రిల్ 11 |
రెండో దశ | ఏప్రిల్ 18 |
మూడో దశ | ఏప్రిల్ 23 |
నాలుగో దశ | ఏప్రిల్ 29 |
ఐదో దశ | మే 6 |
ఆరో దశ | మే 12 |
ఏడోదశ | మే 19 |
ఓట్ల లెక్కింపు | మే 23 |