చిత్తూరు జిల్లా తిరుపతి కల్యాణి డ్యాం పోలీసుల కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకుని బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైన పోలీసులు.. పాసింగ్ అవుట్ పరేడ్ చేశారు. ఈ కేంద్రంలో 42 మంది అసిస్టెంట్ ఎక్సైజ్, ప్రొహిబిషన్ సూపరింటెండెంట్లు, సబ్ ఇన్స్పెక్టర్ల బృందం ఆరు నెలల శిక్షణను పూర్తి చేసుకుంది. వీరి పాసింగ్ అవుట్ పరేడ్ తో పాటు.. ధ్రువపత్రాలు అందించే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు. ధ్రువపత్రాలు అందుకున్న పోలీసులు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా తమకు అందించే బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తామని తెలిపారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి : వెంకటేశ్ నుంచి ఫోన్... హీరో షాక్