అనంతపురం జిల్లా పెనుగొండ మండలం హరిపురం వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై కోడిగుడ్లు తరలిస్తున్న వ్యాను బోల్తా పడింది. ప్రమాదంలో లక్షకు పైగా కోడిగుడ్లు పగిలిపోయాయి. వాహనంలో ప్రయాణిస్తున్న డ్రైవర్లు హనుమంతు, మహమ్మద్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న జాతీయ రహదారి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి..