కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఎం సెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. మొదటి రోజు 1 నుంచి 10 వేల ర్యాంకు వరకు వచ్చిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉండడంతో ఎక్కువ మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా కౌన్సెలింగ్ చేశారు. పైగా తక్కువ ర్యాంకు రావడంతో ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నత స్థాయి చదువు వైపు దృష్టి సారించారు. దీంతో మొదటి రోజు కౌన్సెలింగ్ కేంద్రం వద్ద పెద్దగా సందడి కనిపించలేదు. ఈ నెల 3వ తేదీ నుంచి ఎక్కువ ర్యాంకు వచ్చిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుంది. కౌన్సిలింగ్ వచ్చే అభ్యర్థుల నుంచి విద్యార్హత, ఆధార్ కార్డు, పదవ తరగతి మార్కుల జాబితా తదితర పత్రాలను పరిశీలించారు. కౌన్సిలింగ్ వచ్చే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నిర్వాహకులు వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చదవండీ :