కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన దాడికి నిరసనగా విజయవాడ, రాజమహేంద్రవరంలో ప్రభుత్వ జూనియర్ వైద్యులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. భారతీయ వైద్య మండలి(ఐఎంఏ) పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ఓపి సేవలు నిలిపివేశారు. వైద్యులపై దాడి చేయటం హేయమైన చర్య అని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరిరావు అన్నారు. ప్రభుత్వం వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. చట్టాలనుసరించి వైద్యులపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. భయపెట్టే వాతావరణంలో వైద్యులు పనిచేయలేరని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : 'నిరసన చేపట్టిన విశాఖ డెంటల్ అసోసియేషన్'