శ్రీకాకుళం జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి తన వంతు కృషి చేస్తానని రహదారులు, భవనాల శాఖ మాత్యులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంత్రిగా బాధ్యతులు చేపట్టిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చిన ఆయనకు వైకాపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఆముదాలవలస నుంచి నరసన్నపేట వరకూ మంత్రి ర్యాలీగా వెళ్లారు. నరసన్నపేట వైకాపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన మంత్రి కృష్ణదాస్... జిల్లా అభివృద్ధికి అన్ని పార్టీలు కలిసిరావాలని కోరారు. జిల్లాలో వంశధార, ఇతర జలాశయాలను పూర్తి చేసుకుని నీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి : "సామాజిక బాధ్యత ఉంటే ఇల్లు ఖాళీ చేయండి"