Couple Suicide in Vizag : నేటి సమాజంలో చాలా మంది యువత చిన్నచిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రేమలో విఫలమయ్యామని ఒకరు, పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని మరొకరు, తల్లిదండ్రులు మందలించారని ఇంకొందరు. ఇలా వివిధ కారణలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఏదైనా విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఫలితంగా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలతో తమను నమ్ముకున్న వారిని విషాదంలోకి నెడుతున్నారు.
తాజాగా విశాఖపట్నంలో ఓ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. గాజువాక పరిధిలోని జీవీఎంసీ 69వ వార్డు వెంకటేశ్వర కాలనీలో ఓ యువతి, ఓ యువకుడు మూడంతస్తుల భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను అమలాపురం ప్రాంతానికి చెందిన పిల్లి దుర్గారావు (32), సాయి సుస్మిత (25)గా గుర్తించారు. దుర్గారావు రంగా క్యాటరింగ్ యజమాని కాగా సాయి సుస్మిత సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
పెద్దల తీర్పు అనుకూలంగా రాదేమోనని ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం - ప్రేయసి మృతి, ప్రియుడి పరిస్థితి విషమం
అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మైనర్ల ఆత్మహత్య- ప్రేమికులుగా అనుమానిస్తున్న పోలీసులు