ETV Bharat / briefs

విచారణకు హాజరు కావాల్సిందిగా శివాజీకి నోటీసులు - shivaji

ఇవాళ ఉదయం నటుడు శివాజీని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలంద మీడియాకేసులో ఇప్పటికే లుకౌట్ నోటీసులు ఉన్నందున... ఇమ్మిగ్రేషన్ అధికారులు సైబర్ క్రైం పోలీసులకు సమాచారం అందించారు. శివాజీని అదుపులోకి తీసుకున్న పోలీసులు నోటీసులు ఇచ్చి ఈ నెల 11న హాజరు కావల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

sivaji
author img

By

Published : Jul 3, 2019, 12:07 PM IST

విచారణకు హాజరు కావాల్సిందిగా శివాజీకి నోటీసులు

అలంద మీడియా కేసుకు సంబంధించి నటుడు శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్​ శంషాబాద్ నుంచి అమెరికా వెళ్తున్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలంద మీడియా కేసుకు సంబంధించి శివాజీపై లుకౌట్ నోటీసులు ఇదివరకే జారీ అయ్యాయి. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. శివాజీని అదుపులోకి తీసుకున్న పోలీసులు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పీఎస్‌కు తరలించారు. అనంతరం నోటీసులు ఇచ్చి ఈ నెల 11న విచారణకు హాజరు కావల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.