ETV Bharat / briefs

ప్రజా సమస్యల పరిష్కారానికి ...జగన్​దర్బార్ - ప్రజాదర్బార్

ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు సీఎం జగన్  సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రజా దర్బార్ పేరిట ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించనున్నారు.  బాధితుల సమస్యలను స్వయంగా విని..వాటి సత్వర  పరిష్కారానికి ఆదేశాలు జారచేయనున్నారు. జూలై నుంచి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది.

ప్రజా సమస్యల పరిష్కారానికి 'ప్రజాదర్బార్'
author img

By

Published : Jun 13, 2019, 6:24 AM IST

Updated : Jun 13, 2019, 7:21 AM IST

ముఖ్యమంత్రికి తమ సమస్యలు చెప్పుకుని వాటి పరిష్కారంపై హామీ తీసుకునేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లి.. సీఎం జగన్ నివాసానికి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఉదయాన్నే వినతులు స్వీకరిస్తున్నారని తెలిసి అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి తరలివస్తున్నారు. సీఎం జగన్​ను కలిసేందుకు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, ఉద్యోగులతో సహా వైకాపా కార్యకర్తలు ఆయన నివాసానికి వస్తున్నారు. ఇలా వచ్చే వారితో సీఎం నివాసం రద్దీగా మారుతోంది.

ప్రజా సమస్యల పరిష్కారానికి 'ప్రజాదర్బార్'

బాధితులు తమ సమస్యలను విన్నవించుకునేందుకు సీఎం నివాసం వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నారు. సీఎంను కలిసేందుకు తమకు అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం వారి వినతులు తీసుకుని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారి వినతులను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు. రోజుకు 4 విడతలుగా బయటకు వచ్చి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.

జూలై నుంచి

సీఎంతో నేరుగా కలుస్తామని వేడుకుంటన్నబాధితులు కోసం... సీఎం జగన్ ప్రజాదర్బార్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రత్యేకంగా భవనాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే నెల మొదటివారం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రజలతో నేరుగా మాట్లాడాలని సీఎం నిర్ణయించారు. ప్రతి రోజూఉదయం అరగంట పాటు బాధితుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ నిర్వహించునున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి : ప్రజలతో నేరుగా... ఇకనుంచి జగన్ "ప్రజా దర్బార్"

Intro:ap_vzm_40_11_karate_avb_c9 నోట్ సార్ ర్ ఈ నెల 9వ తేదీ 36వ ఫైలు కరాటే కుగ్రామం కథనానికి బైట్స్

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నిమ్మ వాని వలస కరాటే కుగ్రామం ఈ నెల 9న 36 ఫైల్ గా వేసిన కథనానికి కరాటే శిక్షకుడు గోపాలరావు బైట్స్

Conclusion:నోట్ ఈ నెల 9వ తేదీ 36వ ఫైల్ కు సంబంధించిన beds
Last Updated : Jun 13, 2019, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.