ETV Bharat / briefs

డిసెంబరుకు పోలవరం పూర్తి చేస్తాం: సీఎం

రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న పోలవరం పనులు 69 శాతం పూర్తయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పోలవరానికి కేంద్రం ఇంకా 4 వేల 508 కోట్ల రూపాయలు ఇవ్వాలనీ.. ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్రం తరపున 16 వేల 371 కోట్లు ఖర్చు పెట్టామని వివరించారు.

author img

By

Published : Apr 17, 2019, 5:53 PM IST

cm chandrababu naidu
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

రాష్ట్ర వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టు పనులు 69 శాతం పూర్తయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కాఫర్‌ డ్యామ్‌లో 49 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తికావాలన్నారు. తవ్వకం పనులు ఇంకా 15 శాతం పూర్తవ్వాలని.. కాంక్రీట్ పనులు ఇంకా 15.5 శాతం పూర్తవ్వాలని చెప్పారు. ఎగువ కాఫర్ డ్యామ్‌ ఇంకా 40 లక్షల క్యూబిక్ మీటర్లు పూర్తవ్వాలన్న ముఖ్యమంత్రి... డయాఫ్రం వాల్ వంద శాతం పూర్తయ్యిందన్నారు.

''జులై 15లోగా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తవ్వాలి. కాఫర్‌ డ్యాముల్లో ఇంకా 30 లక్షల క్యూబిక్ మీటర్ల పని ఉంది. పోలవరానికి కేంద్రం ఇంకా 4 వేల 508 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్రం తరపున 16 వేల 371 కోట్లు ఖర్చు పెట్టాం. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అనేక ఇబ్బందులు పెట్టింది. నిర్వాసితులకు రాష్ట్రం నుంచి అదనపు సాయం చేస్తున్నాం. నిర్వాసితులకు అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తున్నాం. పోలవరం పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి'' - చంద్రబాబు, ముఖ్యమంత్రి

కేంద్రం నిధులు ఇవ్వలేదని ప్రాజెక్టు ఆగదు!

పోలవరం ప్రాజెక్టును ఎనీ టైమ్ మనీగా వాడుకుంటున్నారంటూ.. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అది ఏటీఎం కాదనీ.. ఎనీ టైం వాటర్ అనీ మరోసారి స్పష్టం చేశారు. డిసెంబరు నాటికి మొత్తం ప్రాజెక్టు పూర్తవుతుందని సీఎం తేల్చి చెప్పారు. పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్న సీఎం... కేంద్రం నిధులు ఇవ్వలేదని ప్రాజెక్టు నిర్మాణం ఆగబోదని తేల్చి చెప్పారు. వివిధ కారణాలతో 2 నెలలపాటు పనుల్లో జాప్యం జరిగిందన్నారు. అయినా.. ఎప్పటికప్పుడు సమీక్షించి పనులు జరిగేలా చూశామని వివరించారు.

ఇవీ చదవండి..

సంచలనం: రాష్ట్ర ఎన్నికల నిర్వహణలో మరో వివాదం

Intro:ap_vzm_36_17_vadagalpulu_janam_avasthalu_avb_c9 ఒకవైపు ఎండ మరోవైపు వడగాల్పులు మధ్య జనం అవస్థలు పడ్డారు వేసవి ఇబ్బందులు ఫొటోస్

Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలో లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది ఎండవేడికి వడగాల్పులు తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు అత్యవసర పనులపై బయటికి వచ్చిన వాళ్లంతా రక్షణ సాధనా లు ధరించి సాగారు వేసవి ఇబ్బందులు తెలిపే ఫొటోస్

Conclusion:గొడుగు రక్షణలో లో మహిళలు వడగాల్పుల నుంచి ముఖానికి రక్షణగా వివిధ రక్షణ సాధనాలతో జనాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.