ETV Bharat / briefs

ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం: సీఎం జగన్

కలెకర్ల సదస్సులో సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర అక్షరాస్యతా శాతాన్ని పెంచేందుకు తగిన చర్యలు చేపట్టాలని కలెకర్లను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో, నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు.

author img

By

Published : Jun 24, 2019, 4:51 PM IST

Updated : Jun 24, 2019, 6:20 PM IST

ప్రతీ ప్రభుత్వ పాఠశాలను ఆంగ్లమాధ్యమ స్కూలుగా మారుస్తాం : సీఎం జగన్

ప్రజావేదిక కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత (33%) జాతీయ నిరక్షరాస్యత (25.96%) సగటు కన్నా ఎక్కువగా ఉందన్నారు. అక్షరాస్యత శాతం పెంచేందుకే అమ్మ ఒడి పథకం తెస్తున్నామన్నారు. ప్రభుత్వానికి విద్యావ్యవస్థ అత్యంత ప్రాధాన్యమైన రంగాల్లో ఒకటని సీఎం స్పష్టం చేశారు. పాఠశాల ఫొటోలు తీసి... ప్రస్తుతానికి భవిష్యత్తుకి తేడా ఉండేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి పాఠశాలను ఆంగ్లమాధ్యమ స్కూలుగా మారుస్తామనీ... తెలుగును తప్పనిసరి పాఠ్యాంశంగా చేస్తామనీ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు, షూ అన్నీ సకాలంలో అందించేలా ప్రణాళికలు చేపడతామన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా స్కూలు యూనిఫామ్​లలో స్కామ్​లు జరగకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచుతామని సీఎం తెలిపారు.

విద్యా హక్కు చట్టం అమలు

ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు చట్టం తీసుకొస్తామం. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో 25శాతం సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. విద్యరంగాన్ని సేవామార్గంలా చూడాలి కాని, డబ్బు ఆర్జించే రంగంలా కాదు. - వైఎస్ జగన్, ముఖ్యమంత్రి

అందరికీ అమ్మఒడి

వచ్చే ఏడాది జనవరి 26 నుంచి అమ్మ ఒడి చెక్కులు పంపిణీ చేస్తాం. ఏకరూపదుస్తుల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తాం. ప్రైవేట్ స్కూళ్లకు గుర్తింపు తప్పనిసరి. గుర్తింపుతో పాటు కనీస ప్రమాణాలు, నిర్థిష్ట సంఖ్యలో ఉపాధ్యాయులు ఉండాలి. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదే. - వైఎస్ జగన్, ముఖ్యమంత్రి

ఇదీ చదవండి : వచ్చే ఏడాది 10% ఎక్కువగా విత్తన సేకరణ: సీఎం

Intro:ATP:- రాజకీయ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న యానిమేటర్ శశి కుమార్ కుటుంబానికి ఆర్థిక సహాయం చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ ఉద్యోగుల యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధ యూనియన్ సంఘాలతో అనంతపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ఐకాస యానిమేటర్స్ నిరసన తెలియజేశారు.

Body:వైకాపా అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే చిరు ఉద్యోగుల పైన రాజకీయ వేధింపులు అధికమయ్యాయి వారు మండిపడ్డారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న తమకు ఉద్యోగం ఊడుతుందో ...ఉంటుందో అన్న భయంతో బ్రతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇప్పటివరకు తొలగించిన యానిమేటర్స్ అందర్నీ యధావిధిగా కొనసాగించాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు.

బైట్..... వెంకటేష్, సిఐటియు అనుబంధం అధ్యక్షుడు, అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.
Last Updated : Jun 24, 2019, 6:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.