ETV Bharat / briefs

ఈసీ విశ్వసనీయత కోల్పోయింది: చంద్రబాబు

23న తెదేపా ప్రభంజనం సృష్టించబోతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. నూటికి వెయ్యి శాతం గెలుపు తథ్యమన్న చంద్రబాబు...సర్వేలు అంచనాలు మాత్రమేనన్నారు. సంక్షేమం, అభివృద్ధి పథకాలే తెదేపా గెలుపునకు బాటలు వేశాయని ముఖ్యమంత్రి అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు
author img

By

Published : May 20, 2019, 1:59 PM IST

Updated : May 20, 2019, 4:05 PM IST

నూటికి వెయ్యి శాతం తెదేపానే గెలుస్తుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో మాట్లాడిన చంద్రబాబు తెదేపాకు సర్వేలు కొత్తేమీ కాదని గుర్తు చేశారు. గత 35 ఏళ్లుగా తెదేపా సర్వేలు చేస్తోందన్నారు. తెదేపా గెలుపును ఎవరూ అడ్డుకోలేరని అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ 11న ఎన్నికల రోజు ఈవీఎంలలో సమస్యలు వచ్చి కొందరు ఓటు హక్కు వేయకుండా తిరిగి వెళ్లిపోయారు. ప్రసార మాధ్యమాల్లో తాను ఇచ్చిన పిలుపుతో మహిళలు, వృద్ధులు తిరిగి ఓటు వేయడానికి వచ్చారు. రాత్రి 11 గంటల వరకు క్యూలైన్లలలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెదేపా ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే ప్రజలు ఓటు వేయడానికి ముందుకొచ్చారని గుర్తుచేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే తెదేపాను గెలిపిస్తున్నాయని చంద్రబాబు అన్నారు.

సర్వేలపై చంద్రబాబు స్పందన

ఎన్నికల సంఘంపై ఆగ్రహం
బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని 23 పార్టీలు డిమాండ్ చేశాయని చంద్రబాబు తెలిపారు. బ్యాలెట్ పత్రాలు సాధ్యం కాదన్న ఎన్నికల సంఘం వీవీప్యాట్​లు తెచ్చిందని గుర్తు చేశారు. వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించేందుకు ఇబ్బందులు ఉన్నాయని ఎన్నికల సంఘం చెబుతుందన్న చంద్రబాబు... ఆ ఇబ్బందులు ఏంటని ప్రశ్నించారు. 50 శాతం వీవీప్యాట్లు లెక్కించాలని డిమాండ్ చేశారు. పారదర్శక విధానంతో ఓటర్లలో నమ్మకం కల్గించాలంటే వీవీ ప్యాట్​లు లెక్కించాలని కోరారు. ఈసీ చేపట్టిన చర్యలు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఈసీ విశ్వసనీయత కోల్పోయిందని ఆరోపించారు. పోలింగ్‌ కేంద్రంలో ఈసీ నియమాలు వింతగా ఉన్నాయని సీఎం ఎద్దేవా చేశారు.

ఈసీని ప్రశ్నించిన చంద్రబాబు

ఈసీకి ప్రశ్నలు
వైకాపా ఫారం-7ను దుర్వినియోగం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. ఫారం-7 దరఖాస్తు ఎక్కడ నుంచి అప్‌లోడ్ చేశారో ఐపీ అడ్రస్ అడిగితే ఈసీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సమాచారం ఇవ్వమని ఈసీ కోరితే నోరు మెదపడం లేదని విమర్శించారు. వైకాపాను రక్షించేందుకే ఐపీ అడ్రసులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. వైఎస్ వివేకా హత్య కేసు ఇంకా ఎందుకు తేల్చలేదని చంద్రబాబు అన్నారు. హత్యకేసులో ఆధారాలు మాయం చేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఈసీని ప్రశ్నించారు.

సీఎం చంద్రబాబు

వీవీప్యాట్​లపై..
వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని 23 పార్టీలు కూటమిగా ఈసీకి కోరామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈవీఎంలోని ఓట్లు, వీవీప్యాట్‌ స్లిప్పులను వేర్వేరు అధికారులు లెక్కిస్తారనడం అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు కచ్చితంగా లెక్కించాలని డిమాండ్ చేశారు. 5 వీవీప్యాట్ల లెక్కింపులో తేడా వస్తే మొత్తం స్లిప్పులు లెక్కిస్తారా అని ఈసీని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రజల్లో విశ్వసనీయత పెంచాల్సిన బాధ్యత ఈసీపై ఉందని స్పష్టం చేశారు. రూ. 9 వేల కోట్లు ఖర్చు పెట్టి తెచ్చిన వీవీప్యాట్​లు అలంకారమా అని సీఎం ఎద్దేవా చేశారు.

ఎగ్జిట్ పోల్స్​పై చంద్రబాబు వ్యాఖ్య

ఎగ్జిట్ ఫోల్స్ విఫలం
సర్వేలు కేవలం అంచనాలు మాత్రమేనని చంద్రబాబు అన్నారు. 2014లోనూ వైకాపా గెలుస్తుందని తప్పుడు సర్వేలు వచ్చాయని గుర్తుచేశారు. నూటికి వెయ్యి శాతం మే 23 తర్వాత తెదేపానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ ఫోల్స్ ప్రజానాడిని పట్టుకోలేదని అభిప్రాయపడ్డారు.

ఇవీ చూడండి : ఈసీపై విపక్షాల పోరుబాట - రేపు దిల్లీలో ధర్నా

Intro:ap_atp_61_20_nemalikondalo_vrushabha_poteelu_avb_c11
~~~~~~~~~~~~~~~~~*
నెమలికొండ లో వృషభ పోటీలు
~~~~~~~~~~||||||~~~~~~*
గత ఒకటి రెండు దశాబ్దాల క్రితం నుంచి పశు పోషణ భారమై రైతులు దశలవారీగా వృషభ సంపదకు కూడా దూరం అవుతున్న నేపథ్యంలో వృషభ సంపదను కాపాడటానికి పలువురు ఔత్సాహి కులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగానే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని ములకలూరు సమీపంలో ఉన్న నెమలి కొండ ఆవరణంలో ఎద్దుల పోటీలు నిర్వహించారు ఈ కొండ మీద వెలసిన కుమారస్వామి వార్షిక ఉత్సవాల్లో భాగంగా ఎద్దులకు రాతిదూలం లాగుడు పోటీలు నిర్వహించారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 8 జత లకు పైగా ఎద్దులు పైగా పాల్గొనగా ఒక జత కు ఇరవై నిమిషాలు కేటాయించారు ఇందులో ఎక్కువ దూరం రాతిదూలం లాగిన ఎద్దులకు మొదటి బహుమతిగా 30 వేల రూపాయలు రెండో బహుమతి 20000 మూడవదిగా 10000 మిగిలిన ప్రజలకు అందించారు ఈ సందర్భంగా ఈ పోటీలో నిర్వాహకులు గ్రామస్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు
వాయిస్ వన్ మాలకొండ వెంకటేశ్వర్లు ములకనూరు గ్రామస్తుడు

Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గం

Conclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
Last Updated : May 20, 2019, 4:05 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.