ETV Bharat / briefs

ఎన్డీయేతర నేతలతో సీఎం చంద్రబాబు భేటీ - kejriwal

ఎన్నికల ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందురు సీఎం చంద్రబాబు...ఎన్టీయేతర పక్ష నేతలతో భేటీ అవుతున్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ఇవాళ సీతారాం ఏచూరి, కేజ్రీవాల్​ సమావేశమై తాజా పరిణామాలపై మాట్లాడారు. రేపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మయావతితో సమావేశమవనున్నారు.

ఎన్డీయేతర నేతలతో సీఎం చంద్రబాబు భేటీ
author img

By

Published : May 17, 2019, 10:01 PM IST

Updated : May 17, 2019, 11:18 PM IST

ఎన్డీయేతర నేతలతో సీఎం చంద్రబాబు భేటీ

దిల్లీలో పర్యటిస్తోన్న సీఎం చంద్రబాబు...పలువురు జాతీయ నేతలతో భేటీ అయ్యారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో సమావేశమైన చంద్రబాబు... తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఎన్నికల ఫలితాల ఆధారంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ఏచూరితో సమాలోచనలు చేశారు.

ఎన్డీయేతర పార్టీల నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతున్నారు. ఈ భేటీలో భాగంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలతో సమావేశమయ్యారు. బంగాల్ పరిస్థితులు, ఎన్నికల సంఘం వైఖరితో సహా పలు అంశాలపై చర్చించారు.

రేపు ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు లఖ్​నవూ బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు మాయావతితో చంద్రబాబు సమావేశమవనున్నారు.

Intro:శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోటమండలం సముద్రతీర ప్రాంతమైన గోవిందపల్లిపాలెంలోని మస్త్యకారులు బిసి ఆదరణ పథకం కింద కోట ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ వద్ద చేపలవేట వలలకోసం ఒక్కొక్కరు 3100/- నగదు సుమారు రెండువందలమంది వరకు చెల్లించారు. అధికారుల లెక్కల ప్రకారం 88మంది మాత్రమే లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు.వీరిలో కొంతమందికి మాత్రమే వలలు వచ్చాయి వీటి విలువ30000/-. ఎంపీడీవో ఆఫీస్లోని జూనియర అసిస్టెంట్ నగదు తీసుకుని లబ్దిదారులకు ఎటువంటి రసీదు కూడా ఇవ్వలేదని తమను మోసం చేసారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ అసిస్టెంట్ మోసంపై ఎంపిడివో సత్యవాని, బిసి కార్పొరేషన్ అధికారులు విచారణ చెపట్టారు.నిత్యం సముద్రంలో వేట సాగిస్తున్న మస్త్యకారులను ఆదుకోవాలని బాధితులు తెలిపారు. విచారణ చేపట్టి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని ఎంపిడివో సత్యవాని బాధితులకు హామీ ఇచ్చారు. అలాగే భాదితులు మాట్లాడుతూ సముద్రంపై వేట నిషేధ సమయంలో ప్రభుత్వంవారు ఇచ్చే భృతి 4000/- అందరికి వచ్చేలా చేయాలని సముద్రతీర ప్రాంతాలలోని మస్త్యకారులందరికి వచ్చేలా ప్రభుత్వం వారు చర్యలు చేపట్టాలని వారు కోరారు.

Body:1

Conclusion:బిసి ఆదరణ పనిముట్ల డిపాజిట్లు స్వాహా
Last Updated : May 17, 2019, 11:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.