ETV Bharat / briefs

అతి వేగంతో బోల్తాపడిన బస్సులు.... 50 మందికి గాయాలు - krishna

రాష్ట్రంలో ఒకే రోజు రెండు ప్రైవేటు బస్సులు ప్రమాదంబారిన పడ్డాయి.హైదరాబాద్​ నుంచి నెల్లూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వద్ద బోల్తాపడింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రమణా ట్రావెల్స్‌కు సంబంధించిన ప్రైవేటు బస్సు బోల్తా పడింది. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద పల్టీ కొట్టింది.

అతి వేగంతో బోల్తాపడిన బస్సులు.... 50 మందికి గాయాలు
author img

By

Published : May 6, 2019, 10:08 AM IST

Updated : May 6, 2019, 11:02 AM IST

రాష్ట్రంలో ఒకే రోజు రెండు ప్రైవేటు బస్సులు ప్రమాదంబారిన పడ్డాయి. హైదరాబాద్​ నుంచి నెల్లూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వద్ద బోల్తాపడింది. అద్దంకి- నార్కెట్‌పల్లి రహదారిపైన డివైడర్​ను ఢీ కొట్టి పక్కకు పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని అద్దంకి, ఒంగోలు అస్పత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ఉన్నారు. అద్దాలు పగలగొట్టి బాధితులను స్థానికులు బయటకు తీశారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రమణా ట్రావెల్స్‌కు సంబంధించిన ప్రైవేటు బస్సు బోల్తా పడింది. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద పల్టీ కొట్టింది. బస్సులో 20మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిలో సుమారు పదిమంది చిన్నారులున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణీకులు చెబుతున్నారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురు చిన్నారులను విజయవాడకు తరలించారు.

Intro:FILE NAME : JK_AP_ONG_41_06_VARI_RAITULA_KASTALU_PKG_C3_HD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : గతేడాది వ్యవసాయ ప్రారంభం నుండి సమయానికి వర్షం, సాగునీరు పుష్కలంగా ఉండటంతో వరి దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి.. దీంతో ఈ ఏడాది దిగుబడులు మరింత పెరుగుతాయనే ఆశతో ప్రకాశంజిల్లా కొమ్మమూరు కాల్వ ఆయకట్టుకింద వరి విరివిగా సాగుచేశారు.ఈ ఏడాది సకాలంలో వర్షాలు లేకపోవటం అరకొరగా వచ్చిన సాగునీటితో దిగుబడులు తగాయి... వచ్చిన పంటను అమ్ముదామంటే కొనే నాథుడే కరవయ్యాడు.కష్టాలను అధిగమించి వరిపంట పండించిన అన్నదాతలకు మార్కెట్ లోనూ ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. పురుల్లో నిలువ ఉంచిన ధాన్యం రైతు గిట్టుబాటు ధరకోసం కళ్ళుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

వాయిస్ ఓవర్: ప్రకాశంజిల్లా లో వరి పండించిన రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు అధిగమించి పండించిన పంటను అమ్ముకోలేని దైన్యస్దితి లో అన్నదాత ఉన్నాడు. కళ్లెదుటే పండించిన పంటఉన్నా ఆర్ధిక ఇబ్బందులు పడాల్సివస్తుందని కర్షకులు ఆవేదన చెందుతున్నారు.కారంచేడు మండలంలో కొమ్మమూరు కాలువ కింద వరిసాగు చేశారు. ధాన్యం పురుల్లో నింపి లాభసాటి ధరకోసం ఎదురుచూస్తున్నారు. కారంచేడు, స్వర్ణ,కుంకలమర్రు,కేశవారప్పాడు తదితర గ్రామాల్లో 15 లక్షల క్వింటాళ్ల ధాన్యం నిలువలు పురుల్లో పెరుకుపోయాయి. ఒక్క కారంచేడు లొనే 5 లక్షల ధాన్యం నిల్వలున్నాయి. వీటిలో 2270 అనే సన్నరకం ఎక్కువగా నిలువఉంది.. గతేడాది ఈ రకానికి డిమాండు ఎక్కువగా ఉంది.. ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో ఈసారి 2270 రకం వరి సాగుచేశారు. వర్షాభావ పరిస్దితులు కారణంగా ఈ ఏడాది 25 నుండి 30 బస్తాలు దిగుబడి మాత్రమే వచ్చింది. వచ్చిన ధాన్యం పురుల్లో నిలువ చేశారు. నిలుచేసిన ధాన్యానికి గిట్టుబాటు ధర వస్తుందని ఆశించిన అన్నదాత మరింత నష్టాన్ని భరించవలసి వస్తోంది.. బస్తా ధాన్యం ధర రూ.. 13 నుండి 14 వందల రూపాయలుంది. ధర ఎంతోకొంత పెరుగుతుందని ఆశించినా ధర తగ్గటం,కొనే నాధుడే లేకపోవటంతో రైతు మరింత నష్టపోయే పరిస్దితి దాపురించింది. గతేడాది ఎకరాకు కౌలుతో కలిపి 40 వేలరూపాయలు ఖర్చుచేసి వ్యవసాయం చేశారు. ఎకరాకు 40 బస్తాలకు తగ్గకుండా దిగుబడులు వచ్చాయి. అయితే ఈఏడాది అంతమరిపోయిందని ప్రస్తుత ధర చాలదని ఎకరా కౌలు 15 బస్తాలు , మరో 15 బస్తాలు పెట్టుబడులకు రైతుకు సరిపోతాయని ఇక తమకు మిగిలేదిలేదని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో బస్తా ధర కనీసం రెండు వేలరూపాయలున్నా తమకు ఖర్చులు పోను కొద్దిపాటి లాభాలతో బయటపడతామని వరి రైతులు అంటున్నారు. కారంచేడు గ్రామంలో కాళీ స్దలాల్లో పురులు కట్టి,మరికొన్నిచోట్ల గోదాముల్లో ధాన్యం నిలువచేశారు.పండించిన పంట కళ్ళముందే కనపడుతున్నా కొనేనాథుడే కరవయ్యాడు. తెచ్చిన అప్పులు,పెట్టిన పెట్టుబడులు నిలిచిపోయాయని అప్పులు తీర్చే దారిలేదని అమ్ముదామంటే వ్యాపారులు మరి తక్కువకు అడుగుతున్నారని కర్షకులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్దితుల్లో అన్నదాత గిట్టుబాటు ధరకోసం ఎదురుచూస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని.. వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి గిట్టుబాటు ధర కలిపించాలని అన్నదాతలు కోరుతున్నారు. మరలా పంటసీజను ప్రారంభమయితే పెట్టుబడులు ఎలాతెచ్చి పెట్టాలో అర్థం కావటంలేదని కర్షకులు ఆందోళన చెందుతున్నారు.

Body:బైట్ : 1: యార్లగడ్డ కోటేశ్వరరావు, వరి రైతు.
బైట్ : 2 : చాగంటి శ్రీనివాసరావు, వరి రైతు.
బైట్ : 3 : రామకృష్ణమ్మ, వరి రైతు.
బైట్ : 4 : నాగేశ్వరరావు, వరి రైతు.
బైట్ : రత్తయ్య చౌదరి, వరి రైతు.

Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశంజిల్లా, కిట్ నెంబర్ : 748
Last Updated : May 6, 2019, 11:02 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.