పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో చిట్టవరం గ్రామం నుంచి నరసాపురం వెళ్తున్న పాఠశాల బస్సు అదుపు తప్పి పంట కాలువ లోకి దూసుకుపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది చిన్నారులను స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. స్టీరింగ్ సరిగా పనిచేయకపోవడం వల్లే బస్ అదుపు తప్పిందని డ్రైవర్ చెప్పాడు. అనుభవం లేని వారిని డ్రైవర్గా నియమించడం వల్లే ప్రమాదం జరిగిందంటూ చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి..