విశాఖలో భూ కుంభకోణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. భూ కుంభకోణంపై గత ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించిందని... వారిచ్చిన నివేదికను ఇప్పటివరకూ బయటపెట్టలేదని తెలిపారు. సిట్ నివేదికను ప్రజలు ముందు ఉంచి దోషులకు శిక్షపడేలా చేయాలని కన్నా కోరారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి : 'ముఖ్యమంత్రి జగన్ కు కేశినేని రెండు ప్రశ్నలు'