దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే గొప్ప నాయకుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీనే అని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో జరిగిన యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ... మోదీ అంతర్జాతీయ నేతగా ఎదిగారని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో దేశంలో ఎవరూ ఊహించని విజయాన్ని అందుకున్న భాజపా... భవిష్యత్తులోనూ ఇలాంటి రికార్డులే నమోదు చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం పార్టీలో చేరిన 200 మంది నాయకులను కండువా కప్పి ఆహ్వానించారు.
ఇదీ చదవండీ...