విశాఖలో భూముల కుంభకోణంపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి.. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఐదేళ్లలో విశాఖ కేంద్రంగా భూ ఆక్రమణలు జరిగాయని, వీటిపై ఇప్పటికే విచారణ జరుగుతోందన్నారు. విశాఖ రెవెన్యూ అధికారులు, ఇతర శాఖల అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఏడాదికి 5 లక్షల ఇళ్లు మంజూరు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడానికి రెవెన్యూ సిబ్బంది సహకరించాలని కోరారు. విశాఖను అవినీతి రహిత జిల్లాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి : టోల్ ప్లాజా సిబ్బందిపై... మంత్రి అనుచరులమంటూ దాడి!