ETV Bharat / briefs

ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయి : ద్వివేది - గోపాలకృష్ణ ద్వివేది

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్​ల భద్రతపై వచ్చే అనుమానాలు కేవలం అసత్యప్రచారాలని గోపాలకృష్ణ ద్వివేది ఖండించారు. ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయని తెలిపారు

ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయి : ద్వివేది
author img

By

Published : Apr 24, 2019, 7:07 PM IST

ఈవీఎం స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రతపై అనుమానాలు అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయని ఆయన చెప్పారు.వాటిన భద్రపరిచిన గదుల్లోకి ఎవరికి ప్రవేశం ఉండదని..., ఆ ప్రదేశాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉందని తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు తమ సందేహ నివృత్తి కోసం తమ ఏజెంట్లను స్ట్రాంగ్‌ రూమ్‌ కంట్రోల్‌ రూమ్‌లలో 24 గంటలు ఉంచవచ్చని ద్వివేది చెప్పారు.

స్ట్రాంగ్‌ రూంల భద్రతలో పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈసీ నిర్ణయం తీసుకుందన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో ఉండవని..., వైఫై ద్వారా ఈవీఎంలను నియంత్రిస్తారనే ప్రచారంలో నిజం లేదని పేర్కొన్నారు. ఎటువంటి అపోహలకు తావివ్వకుండా ఉండేలా భద్రత చర్యలు చేపట్టామని వివరించారు. చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్‌రూమ్‌లపై వచ్చినవి అసత్యప్రచారాలన్నారు. పుకార్లను ప్రచారం చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలిచ్చామని చెప్పారు.

ఇవీ చదవండి

శ్రీవారి సేవలో మంత్రి అయ్యన్నపాత్రుడు

Intro:విశాఖ జిల్లా అరకులోయలో ని ప్రత్యేక గిరిజన సంక్షేమ క్రీడా పాఠశాలల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభమైంది రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలోని గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు శిక్షణ తరగతులకు హాజరయ్యారు వీరందరికీ ఇండోర్ అవుట్డోర్ క్రీడల్లో నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు గురుకుల అధికారులు చర్యలు చేపట్టారు కబడ్డీ వాలీబాల్ ఆల్ విలువిద్య త్రో బాల్ అండ్ బాల్ తదితర క్రీడల్లో ఉచిత భోజన వసతి ఇ కల్పించి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గురుకుల పాఠశాల రాష్ట్ర కార్యదర్శి ఇ e బాల్ కుమార్ క్రీడా శిక్షణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు గిరిజన విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు గురుకుల విద్యార్థులకు క్రీడల్లో మెరుగైన రీతిలో లో శిక్షణ అందించి జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు

Body:13 జిల్లాల నుంచి చి హాజరైన విద్యార్థిని విద్యార్థులు పర్యటన నిర్వహించారు విద్యార్థుల నుంచి కార్యదర్శి ఇ గౌరవ వందనం స్వీకరించారు

Conclusion:గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు చదువుతోపాటు అన్ని రంగాల్లోనూ తర్ఫీదునిచ్చి ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు క్రీడా పాఠశాలలోనే సంస్కృతిక భాగాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు అరకు లోయ క్రీడా పాఠశాలను మోడల్ పాఠశాల మార్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు పూర్తిస్థాయి భవనాన్ని నిర్మించేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిధులను విడుదల చేసిందన్నారు ఈ నిధులతో సకల సౌకర్యాలతో క్రీడా పాఠశాల నిర్మాణం జరుగుతుందన్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.