అనంతపురం జిల్లా గుత్తిలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం వెనుకబడిన వర్గాల వారికి అండగా ఉండేందుకు 10 వేల కోట్ల రూపాయలతో 'ఈ బ్యాంకు' ను ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న సీఎం...ఏప్రిల్ తొలివారంలో రైతులకు రుణమాఫీ నగదు వస్తుందన్నారు. కరవు సీమకు కియా మోటార్స్ తీసుకువచ్చిన ఘనత మాదేనన్న బాబు.. జాబు రావాలంటే మళ్లీ బాబురావాలని పిలుపునిచ్చారు. హంద్రీనీవా నుంచి జిల్లాలోని చెరువులకు నీళ్లు తెచ్చే బాధ్యత నాదన్న సీఎం... నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లిస్తామని తెలిపారు. తాగు, సాగునీరు అందుబాటులోకి తీసుకురావటం ద్వారా అనంతపురాన్ని దేశంలోనే ఉత్తమ జిల్లాగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని హార్టి కల్చర్ హబ్‌గా మార్చి.. అన్ని ప్రాంతాల వారు ఇక్కడే ఉపాధి పొందేలా అభివృద్ధి చేస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఇవి కూడా చదవండి:ఎన్నికల సిత్రం.. దోశ వేసిన వసుంధర