ప్రతిపక్షంలో ఉన్నా...సమస్యలపై పోరాడుతూ ప్రజలకు అండగా ఉంటామని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట సూర్యనారాయణ చెప్పారు. అనంతపురం జిల్లా లక్ష్మి చెన్నకేశవపురంలో ఏర్పాటు చేసిన తెదేపా కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన కార్యకర్తలకు అండగా నిలుస్తామన్నారు. ప్రజాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టే చర్యలకు సహకరిస్తామన్న ఆయన...అవినీతి జరిగితే మాత్రం నిలదీస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తామని సూర్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : 'ఒంటరి మహిళలకు ఉపాధి కల్పించాలి'