ETV Bharat / briefs

'పరిధి దాటితే సహించం'

​​​​​​​సైబరాబాద్ సీపీ వ్యాఖ్యలు, వ్యవహార శైలి సరిగా లేదని మంత్రి కాలవ శ్రీనివాస్ మండిపడ్డారు. సీపీ సజ్జనార్‌ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. పరిధికి మించి ప్రవర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని గుర్తుచేశారు.

author img

By

Published : Mar 6, 2019, 9:29 AM IST

మంత్రి కాలవ శ్రీనివాస్

తెలంగాణలోని సైబరాబాద్ సీపీ వ్యాఖ్యలు, వ్యవహార శైలి సరికాదని మంత్రి కాలవ శ్రీనివాస్ మండిపడ్డారు. సీపీ సజ్జనార్‌ తీరునుతీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. పరిధికి మించి ప్రవర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని గుర్తుచేశారు. తెలంగాణ పోలీసు అధికారులపై చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాట్లు వెల్లడించారు. చట్టప్రకారం తమకున్న హక్కులు ఉపయోగించుకుంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలను తిప్పికొడతామని మంత్రి కాలవ స్పష్టం చేశారు. ఐటీ రంగంలో ఏపీ సాధిస్తున్న విజయాలు దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. దురుద్దేశంతో కావాలనే బురద జల్లుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై సీపీ చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయన్నారు. చట్టప్రకారం ముందుకెళ్లి గట్టిగా బుద్ధిచెబుతామని తెలిపారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడే హక్కు సైబరాబాద్‌ సీపీకి లేదని ఘాటుగా హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఎలా దాడులు చేయిస్తున్నారో చూస్తూ ఉన్నామని... ఏపీ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతామని తెలిపారు. డేటా చౌర్యం వివరాలను త్వరలో పూర్తిస్థాయిలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.