రాష్ట్రంలో నలుగురు ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా ఉన్న వివేక్ యాదవ్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా నియమించింది.
- ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి బదిలీ చేసి.. ఎపీఈపీడీసీఎల్ ఎండీగా నియమించింది.
- వాటర్ షెడ్ అభివృద్ధి డైరెక్టర్ ఎస్. రమణా రెడ్డిని బదిలీ చేశారు. ఆయన్ను ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ వైస్ ఛైర్మన్, ఎండీగా నియమించారు.
- ఏపీ మార్క్ ఫెడ్ ఎండీ, ఆగ్రోస్ వైస్ ఛైర్మన్, ఎండీగా వి.విజయరామరాజు నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
- వీరితో పాటు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) ఛాన్సలర్ నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఆ పదవికి ప్రొఫెసర్ కె.సి .రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.ఎస్.వి.ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్జీయూకేటీ ఛాన్సలర్ పదవిలో ప్రొఫెసర్ కె.సి రెడ్డి ఐదేళ్లపాటు కొనసాగనున్నారు.
ఇదీ చదవండి : 'మధ్యాహ్న భోజన పథకంలో అల్పాహారం చేర్చబోం'