ETV Bharat / briefs

రైతు, శ్రామిక, ఉద్యోగ వర్గాలపై మంత్రి మండలి వరాల జల్లు - మంత్రి మండలి

రాష్ట్రంలో కొలువుతీరిన కొత్త ప్రభుత్వ మంత్రివర్గ తొలి సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. సమావేశం ప్రారంభం కాగానే మంత్రులను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను మంత్రులకు వివరించారు. అవినీతి లేని పారదర్శకత పాలనే వైకాపా లక్ష్యమన్న జగన్...అందుకు మంత్రులు తమ వంతు కృషిచేయాలన్నారు.

ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం
author img

By

Published : Jun 11, 2019, 7:14 AM IST

ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం వివిధ అంశాలపై చర్చించింది. సుదీర్ఘంగా సాగించిన సమావేశంలో ...ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాలపై సీఎం జగన్ మంత్రులతో చర్చించారు.

అవినీతి లేని పారదర్శక పాలన

అవినీతి, అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని జగన్ స్పష్టం చేశారు. ఎక్కడైనా ఈ తరహా ఫిర్యాదులు వస్తే నిజనిర్థారణ చేసి మంత్రి పదవి నుంచి తప్పిస్తానని మంత్రులను గట్టిగానే హెచ్చరించారు. సోమవారం అమరావతిలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో పాలనాంశాలపై కీలకమైన చర్చజరిగింది. మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేసే విషయమై ప్రతి నిర్ణయాన్ని సీఎం జగన్...మంత్రుల అభిప్రాయాలను తీసుకున్నారు. విధివిధానాల రూపకల్పనపై మంత్రులతో చర్చించారు. పరిపాలనలో పాతుకుపోయిన అవినీతి సహా దిగజారుతోన్న రాజకీయ వ్యవస్థను వీలైనంత త్వరగా మార్చి...అవినీతిని రూపుమాపడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రులకు సీఎం సూచించారు

గ్రామ వాలంటీర్లు

గ్రామ వాలంటీర్ల పోస్టుల నియామకంపై మంత్రులతో చర్చించిన జగన్...ఈ ఉద్యోగాలకు విద్యార్హతను డిగ్రీగా నిర్ణయించారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్​ను తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. విద్యార్హత విషయంలో..డిగ్రీ చదివిన వారు ఎక్కువ సంఖ్యలో ఉండరనే అభిప్రాయంతో...విద్యార్హతను ఇంటర్​కు మార్చాలని మంత్రులు కోరారు. ఈ చర్చ అనంతరం...సీఎం జగన్..గ్రామ వాలంటీర్ల విద్యార్హతను గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్, పట్టణాల్లో డిగ్రీగా నిర్ణయించారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్నీ అమలు పరిచే ఆ దిశగా మంత్రులంతా కష్టపడి పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

రైతు, శ్రామిక, ఉద్యోగ వర్గాలపై మంత్రి మండలి వరాల జల్లు

సీపీఎస్ రద్దుపై కమిటీ

సచివాలయంలో తొలిసారి భేటీ అయిన రాష్ట్ర కేబినెట్ సీపీఎస్ రద్దు, ఆర్టీసీ విలీనం వంటి అంశాల్లో తక్షణమై కమిటీలు వేసి సిఫార్సుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించింది. ఉద్యోగులకు మధ్యంతర భృతిని భారీగా పెంచేందుకు మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. వీటితో పాటు పొరుగు సేవలు, కన్సల్టెన్సీలను రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగుల మధ్యంతర భృతిని 27 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని జూలై 1 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన ఇద్దరు కార్యదర్శులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి సీపీఎస్ రద్దుకు త్వరితగతిన కార్యాచరణను రూపొందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

అర్హతలు, అనుభవం ఆధారంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు అంగీకరించిన ప్రభుత్వం...ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు, కన్సల్టెన్సీలను వెంటనే రద్దు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. అన్ని శాఖల్లోని పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.18 వేలకు పెంచుతూ మంత్రి నిర్ణయం తీసుకుంది. అంగన్​వాడీలు, హోంగార్డులకు తెలంగాణ రాష్ట్రం కంటే 1000 రూపాయలు అదనపు వేతనం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

ఆర్టీసీ విలీనం

ఆర్టీసీని రాష్ట్రప్రభుత్వంలో విలీనం చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈ విషయమై ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విలీనానికి సంబంధించి ఈ రెండు కమిటీలు సంయుక్తంగా చర్చించి ఓ కార్యాచరణ రూపొందించనున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ రూ.6,373 కోట్లు నష్టంలో ఉందన్న రవాణా శాఖ మంత్రి..53 వేలకు పైగా సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్టీసీని నడపడానికి ఉద్యోగుల ఖాతాల్లోంచే రూ.2900 కోట్ల నిధులను గత ప్రభుత్వం వినియోగించిందని కేబినెట్ అభిప్రాయపడింది. నిర్వహణ వ్యయం తగ్గించేలా ఎలక్ట్రిక్ బస్సులు పెద్ద ఎత్తున ప్రవేశపెట్టాలని కోరింది.

ప్రతి గ్రామంలో అర్హత కలిగి, ఇళ్లు లేని వారిని అందరినీ గుర్తించి ప్రభుత్వం ఆయా గ్రామాల్లో భూములు కొనుగోలు చేసి లబ్ధిదారులకు ఉగాది రోజున ఇళ్ల పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. లబ్ధిదారులకు పూర్తి సంతోషం కలిగేలా ఈ పథకం అమలు జరిగేలా కేబినెట్ నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ ఆ ఇంటి ఇల్లాలి పేరుపైనే ఉండేలా మంత్రి మండలి అభిప్రాయం వ్యక్తం చేసింది.

కీలక నిర్ణయాలు

వైఎస్సార్ పేరు మీద రాబోయే నాలుగేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించారు. నవరత్నాల్లో ఒకటైన అమ్మఒడి కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రారంభించాలని సీఎం తెలిపారు. చౌకదుకాణాల్లో నాణ్యమైన బియ్యం, సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలు పునరుద్ధరించాలని నిర్ణయించారు. అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు లబ్ధి చేసేందుకు తక్షణమే రూ.1150 కోట్లు కోర్టులో జమ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. 20వేల రూపాయల లోపు డిపాజిటర్లకు తొలుత చెల్లింపులు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఇవీ చూడండి : తొలి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలివే!

Intro:AP_ONG_13_10_COLLECTOR_RIMS_VISIT_AV_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..................................................................................ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిని నూతన కలెక్టర్ పోలా భాస్కర్ పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో ని ముఖ్య శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సెక్యూరిటీ సిబ్బందికి జనవరి మాసం తర్వాత జీతం అందక పోవడానికి వివరణ కోరారు. ప్రస్తుతం ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మందుల కొరత , సిటీ స్కాన్ సమస్య , సిబ్బంది జీత భత్యాలు, సిబ్బంది కొరత ఆసుపత్రి వంటి అంశాలపై సూపర్డెంట్ ని ప్రశ్నించారు. ఎన్ని రోజులు నుంచి సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదో ఎంత మొత్తంలో డబ్బులు అందజేయాలో, ఎంత మంది సిబ్బంది అవసరమో నివేదిక తయారు చేసి తనకు ఇమ్మని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.....విజువల్స్

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.