ETV Bharat / briefs

రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం

నవ్యాంధ్ర ప్రదేశ్‌ రెండో సభాపతిగా తమ్మినేని సీతారాం ఎన్నికయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నుంచి ఎన్నికైన ఆయన... సభాపతిగా కొనసాగనున్నారు.

speaker seetaram
author img

By

Published : Jun 13, 2019, 11:08 AM IST

Updated : Jun 13, 2019, 2:49 PM IST

రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం

రాష్ట్ర శాసన సభాపతిగా ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ ఎన్నికకు సంబంధించి బుధవారం తమ్మినేని సీతారాం ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయమైంది. స్పీకర్‌ ఎన్నిక కోసం ప్రొటెం స్పీకర్‌ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు బుధవారం మధ్యాహ్నం ప్రకటన జారీ చేశారు. సీతారాం నామినేషన్‌ను 11మంది మంత్రులు, 19మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ప్రొటెం స్పీకర్‌ అప్పలనాయుడు సమక్షంలో అసెంబ్లీ ఇన్‌ఛార్జి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు సీతారాం తన నామినేషన్‌ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, టి.వనిత, ఎమ్మెల్యేలు బి.ముత్యాలనాయుడు, జోగి రమేష్‌, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఈ ఉదయం 11 గంటలకు సభాపతిగా తమ్మినేని సీతారాం ఎన్నికైనట్లు ప్రకటించారు.తర్వాత ఆయన సభాపతి స్థానంలో కూర్చోనున్నారు. ఆపై స్పీకర్‌ ఎన్నిక పట్ల సభలో సభ్యులు వారి స్పందన తెలియపరిచారు. అభినందనలు తెలియజేశారు. ఉపసభాపతి ఎన్నికకు సంబంధించిన ప్రకటన ఇవాళే వెలువడనుంది. బాపట్ల నుంచి ఎన్నికైన కోన రఘుపతిని ఉపసభాపతి పదవికి వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఖరారు చేసిన సంగతి తెలిసిందే. రఘుపతి నామినేషన్‌ దాఖలు చేశాక సోమవారం ఆయన ఎన్నికైనట్లు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Intro:AP_GNT_26_09_PAWAN_REVIEW_RAYALASEEMA_AV_C10

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

(. ) స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి లోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ రాయలసీమ నేతలతో సమావేశమయ్యారు. రాయలసీమలో అధిక సంఖ్యలో ఓట్లు వచ్చాయని వీటిని కాపాడుకునేందుకు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు జనసేన నాయకులు అండగా నిలవాలని పవన్ సూచించారు.

Body:viss

Conclusion:only
Last Updated : Jun 13, 2019, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.