తెదేపా హయాంలో రైతులకు విత్తన కొరత లేకుండా చేశామని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. విత్తనాలు సకాలంలో అందించలేక తెదేపా పాలనపై నిందలేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పరిపాలనలోని పరిస్థితులే మళ్లీ పునరావృతం అవుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల కోడ్ సమయంలోనూ.. వైకాపా అనధికారికంగా పెత్తనం చేసింది. సీఎస్ నుంచి ఐఏఎస్, ఐపీఎస్‌ల వరకూ బదిలీలు చేయించారన్నారు. అధికారులతో సమీక్ష చేసుకునేందుకు అడ్డుపడ్డారని ఆరోపించారు. ఇప్పటికైనా విత్తనాలు సిద్ధం చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.
ఇవీ చదవండి.. విత్తనాల కోసం అన్నదాతల తంటాలు