అన్ని పార్టీలు రానున్న ఎన్నికలను బహిష్కరించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ విజ్ఞప్తి చేశారు. దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన... ఏపీలో వైకాపా అధ్యక్షుడు జగన్‌ను గెలిపించడానికి భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈవీఎం యంత్రాలు పని చేయకుండా ఎన్నికల కమిషన్‌తో కలిసి కుట్ర పన్నిందన్నారు. అన్ని పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కోరారు. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలని అందరూ డిమాండ్ చేయాలని కోరారు.
ఇదీ చదవండి