ఫొని తుపాను మే 1నుంచి అతి తీవ్రంగా మారనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కోస్తాంధ్రలోని విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. తీరం వెంట సుమారు 70 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని... కాకినాడ, మచిలీపట్నం, విశాఖ పోర్టుల్లో హెచ్చరికలు కూడా జారీ చేశామని తెలిపారు. తెలంగాణలో మాత్రం రెండు, మూడు రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న వాతావణ శాఖ అధికారిణి శ్రావణితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
అతితీవ్రంగా మారనున్న 'ఫొని': వాతావరణ శాఖ - ఫొని
ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడ్డ ఫొని తుపాను తీవ్ర రూపం నుంచి అతి తీవ్రంగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్లోని తీర నగరాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని సూచించింది.