జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో దర్శకుడు కోడి రామకృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. పెద్ద కుమార్తె దీప్తి దహన సంస్కారాలు నిర్వహించారు. అంతిమ ప్రక్రియకు పెద్ద సంఖ్యలో సినీప్రముఖలు, అభిమానులు తరలివచ్చారు. అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు.
అంతకు ముందు అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్‌లో గంటపాటు పార్థివదేహాన్ని ఉంచారు. అనంతరం ఫిల్మ్ ఛాంబర్ నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర చేపట్టారు. అంతిమయాత్రలో సినీప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నీరుమున్నీరుగా విలపించారు.