కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రఫేల్ ఒప్పందంపై చేసిన ఆరోపణలను ఖండించింది రిలయన్స్ సంస్థ. కాంగ్రెస్ అధ్యక్షుడు బహిర్గతపరిచిన ఈ-మెయిల్ రఫేల్ ఒప్పందానికి సంబంధించింది కాదని, ఎయిర్‌బస్ హెలికాఫ్టర్దని స్పష్టం చేసింది.
రాహుల్‌గాంధీ చూపించిన ఈ-మెయిల్ ఎయిర్ బస్-రిలయన్స్ డిఫెన్స్‌కు సంబంధించింది. పౌర,యుద్ధ హెలికాఫ్టర్ల గురించిన ఒప్పందం. మేక్ఇన్ ఇండియా కార్యక్రమం కింద ఈ ఒప్పందం చేసుకోవాలనుకున్నాం, కానీ ఇది మహీంద్రా సంస్థకి తరలిపోయింది-రిలయన్స్ ప్రతినిధి
రఫేల్ ఒప్పందం జరిగింది 2016 జనవరి 25న. మెయిల్ పై ఉన్న తేదీ ఏప్రిల్ 2015ది. దీనిని చూస్తే నిజాలు తేటతెల్లమవుతున్నాయని వ్యాఖ్యానించింది.