కడప జిల్లా బద్వేలు మండలంలోని కోనసముద్రం గ్రామంలో 300 ఏళ్ల కిందట మూగ సుబ్బయ్య అనే భక్తుడు ఉండేవాడు. ఈయన వీరబ్రహ్మేంద్రస్వామి మనుమరాలైన ఈశ్వరమ్మ వద్ద శిష్యరికం చేసేవాడు. సుబ్బయ్య సేవలకు గుర్తింపుగా..ఈశ్వరమ్మ గుమ్మడి పండు, రుద్రాక్ష మాల, తాళపత్ర గ్రంథం, విభూది పండు అందజేశారు. మూగ సుబ్బయ్య ఈ వస్తువులను తన కుటుంబీకులకు అందించి...బ్రహ్మంగారిమఠంలో యోగ సమాధి పొందారు. ఆనాటి నుంచి వస్తువులను భద్రపరుస్తూ..భావితరాలకు చరిత్ర తెలియజేస్తోన్న వీరిని గ్రామస్థులు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి : బ్లేడ్ బ్యాచ్లో సత్ప్రవర్తన... సాధ్యమేనా!?