జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. గండేర్బల్ జిల్లా పాండచ్ ప్రాంతంలో గస్తీ విధులు నిర్వర్తిస్తున్న బీఎస్ఎఫ్ బృందాన్ని లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు.
" శ్రీనగర్‌కు 17 కిలోమీటర్ల దూరంలోని పాండచ్ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న జవాన్లపై ద్విచక్రవాహనంపై వచ్చిన ముష్కరులు దాడి చేశారు. ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్ల తలకు బలమైన గాయాలయ్యాయి. వారిని సౌర ప్రాంతంలోని స్కిమ్స్ ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో ఒకరు, ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఒకరు మృతిచెందారు."
- అధికారులు
ఘటన జరిగిన ప్రాంతంలో అదనపు బలగాల్ని మోహరించి, దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు అధికారులు.