ETV Bharat / city

Gachibowli Car Accident: హైదరాబాద్​లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం - Gachibowli Road Accident Today

three persons died in Gachibowli Road accident
హైదరాబాద్ గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Dec 18, 2021, 7:20 AM IST

Updated : Dec 18, 2021, 9:55 AM IST

07:18 December 18

Gachibowli Road Accident News: మృతుల్లో ఇద్దరు జూనియర్​ ఆర్టిస్టులు

గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

Gachibowli Road Accident Today: హైదరాబాద్​ గచ్చిబౌలిలోని హెచ్​సీయూ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్​ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు జూనియర్​ ఆర్టిస్టులతో పాటు మరొకరు మృతి చెందారు. మరో జూనియర్ ఆర్టిస్టు సిద్ధుకు తీవ్ర గాయాలయ్యాయి. అతణ్ని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Junior Artists Died in Gachibowli Accident news : తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో మృతులు జూనియర్ ఆర్టిస్టులు ఎన్.మానస(23), ఎం. మానస(21), బ్యాంక్​ ఉద్యోగి అబ్దుల్ రహీమ్ (25)​గా పోలీసులు గుర్తించారు. వీరంతా అమీర్​పేట్​లోని ఓ వసతిగృహంలో ఉంటున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడకు చెందిన రహీమ్..​ మాదాపూర్‌లోని యాక్సిస్ బ్యాంకులో పని చేస్తున్నాడు. ఎం.మానస స్వస్థలం తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లిగా గుర్తించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Gachibowli Road Accident news: కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నలుగురికి ఎలా పరిచయం ఉందన్న వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి లింగంపల్లి ఎందుకు వెళ్తున్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు చెప్పారు.

ఇదీచదవండి..

married woman dead: పెళ్లై రెండు నెలలైనా కాలేదు.. వివాహిత అనుమానాస్పద మృతి

Last Updated : Dec 18, 2021, 9:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.