ETV Bharat / state

అమెరికాలో భారత ఆర్థిక దౌత్యవేత్తగా తెలుగు ఐఏఎస్ అధికారి

author img

By

Published : Jun 4, 2020, 4:08 PM IST

Updated : Jun 4, 2020, 5:49 PM IST

అమెరికాలో భారత ఆర్థిక దౌత్యవేత్తగా తెలుగు ఐఏఎస్ అధికారి
అమెరికాలో భారత ఆర్థిక దౌత్యవేత్తగా తెలుగు ఐఏఎస్ అధికారి

16:04 June 04

ఐఏఎస్‌ అధికారి రవి కోట ఆర్థిక దౌత్యవేత్తగా నియామకం

తెలుగు తేజం.. ఐఏఎస్​ రవి కోట అగ్ర గుర్తింపు పొందారు. అగ్రరాజ్యం అమెరికాలో భారత రాయభార కార్యాలయంలో ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా నియమితులయ్యారు. అమెరికాలో భారత ఆర్థిక దౌత్యవేత్తగా ఐఏఎస్‌ రవి కోటను నియమిస్తూ  డిపార్ట్​మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 

ఐఏఎస్​ రవి కోట నియమకంపై కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు డీఓపీటీ ప్రకటించింది. అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో ఆర్థిక వ్యవహారాల చీఫ్‌గా రవి కోట విధులు నిర్వర్తించనున్నారు. 1993 బ్యాచ్​కు చెందిన ఐఏఎస్‌ అధికారి రవి కోట.. స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటపాడు. ప్రస్తుతం ఆయన 15వ ఆర్థిక సంఘం సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు.  

ఇదీ చదవండి :  ప్రధాని మోదీ రైతు పక్షపాతి: విష్ణువర్ధన్ రెడ్డి

Last Updated : Jun 4, 2020, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.