మూడు రాజధానుల అంశంపై కేంద్రమంత్రి రాందాస్ అఠావలే కీలక వ్యాఖ్యలు చేశారు. వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులు అంటోందని.., మూడు చోట్ల రాజధానులు పెడితే ఎక్కడకు రావాలి? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఒక్క రాజధాని కూడా అభివృద్ధి కావటం లేదన్నారు.
రాష్ట్ర విభజన సమయంలోనే రాజధానికి నిధులు ఇవ్వాల్సిందన్నారు. రాజధాని నిధులపై యూపీఏ సర్కారు విస్మరించిందని.., నిధులు లేకపోతే రాజధాని నిర్మాణం ఎలా కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం అమరావతి పనులు ఆగిపోయాయన్న అఠావలే.. రాజధానికి నిధులు ఇచ్చే అంశాన్ని మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.
రాష్ట్ర విభజన వేళే రాజధానికి నిధులు ఇవ్వాల్సింది. రాజధాని నిధులను యూపీఏ సర్కారు విస్మరించింది. ప్రస్తుతం అమరావతి పనులు ఆగిపోయాయి. రాజధానికి నిధులు ఇచ్చే అంశాన్ని మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. నిధులు లేకపోతే రాజధాని నిర్మాణం ఎలా కొనసాగుతుంది?. వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులు అంటోంది. ప్రస్తుతం ఒక్క రాజధాని కూడా అభివృద్ధి కావడం లేదు. మూడు చోట్ల రాజధానులు పెడితే ఎక్కడకు రావాలి? - అఠావలే, కేంద్రమంత్రి
ఇదీ చదవండి