ETV Bharat / bharat

అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. మూడు నెలలపాటు గ్యాంగ్ రేప్.. గర్భవతిగా ఇంటికి.. - కేరళలో యువతిపై స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్

ఓ యువతిని ముగ్గురు దుండగులు కిడ్నాప్ చేసి మూడు నెలల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆ యువతి నాలుగు నెలల గర్భవతి. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది.

young woman kidnapped and raped in maharashtra
ఓ యువతిపై మూడు నెలలపాటు గ్యాంగ్ రేప్
author img

By

Published : Jan 13, 2023, 5:07 PM IST

Updated : Jan 13, 2023, 5:34 PM IST

మహారాష్ట్ర అమరావతిలో ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. అచల్​పుర్ తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి మూడు నెలల పాటు ఆమెపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి ఆమె ఎలాగోలా తప్పించుకుని ఇంటికి చేరింది. ప్రస్తుతం ఆ యువతి గర్భవతి. బాధితురాలి ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు సమాచారం ప్రకారం.. ఆ యువతిని సెప్టెంబరు 22న అర్ధరాత్రి 12గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఈ విషయంపై ఆమె బంధువులు పోలీసులకు సెప్టెంబరు 23న ఫిర్యాదు చేశారు. దుండగులు ఆ యువతిని పావ్​నే ప్రాంతం నుంచి ఎత్తుకెళ్లి తెలియని ప్రదేశంలో మూడు నెలలపాటు ఉంచి ఆమెపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని బాధితురాలు డిసెంబరు 14న తన ఇంటికి చేరింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె అస్వస్థతకు గురైంది.

యువతిని చికిత్స కోసం అచల్‌పుర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేయగా ఆమె గర్భవతి అని తేలింది. దీంతో డాక్టర్ ఆమె వద్ద వాంగ్మూలాన్ని తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
యువతి మిస్సింగ్ గురించి ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె ఇంటికి తిరిగి వచ్చిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పలేదు. పరువు పోతుందనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ఆ విధంగా చేసి ఉంటారని పోలీసులు భావించారు. అయితే ఆ యువతి నుంచి డాక్టర్ పూర్తి సమాచారం తీసుకుని పోలీసులకు సమాచారం అందించిన విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియదు.

మత్తు ముందు కలిపిన జ్యూస్ తాగించి గ్యాంగ్ రేప్..
కేరళ కోజికోడ్​లో 22 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు చెవాయూర్​కు చెందిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మరో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

బాధితురాల కథనం ప్రకారం.. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ యువకుడు పాంథీరంకావులోని ఒక ఫ్లాట్​కు ఆమెను రమ్మన్నాడు. అక్కడకు వెళ్లిన యువతికి అతడు మత్తుమందు కలిపిన జ్యూస్ ఇచ్చి తాగమని చెప్పాడు. ఆమె మత్తులోకి జారుకున్నాక అతడు, తన ముగ్గురు స్నేహితులు కలిసి యువతిపై గ్యాంగ్ రేప్​కు పాల్పడ్డారు. అయితే ఈ ఘటన ఏడాది క్రితం జరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

బాధితురాలు తెలిపిన వివరాల మేరకు పోలీసులు గురువారం రాత్రి నిందితులను పట్టుకున్నారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసుకుంటామని పోలీసులు తెలిపారు. యువతి ఆరోపణలను ధృవీకరించేందుకు బాధితురాలు, నిందితులు ఫోన్ రికార్డ్స్​ను కూడా పరిశీలిస్తామని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు మరో నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు.

Last Updated : Jan 13, 2023, 5:34 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.