ETV Bharat / bharat

పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న యువతి ఆత్మహత్య.. విద్యార్థుల ఆందోళనతో అర్థరాత్రి ఉద్రిక్తత - Young Girl suicide in hostel at hyderabad

Young Girl Hangs to Death at Hostel at Hyderabad: హైదరాబాద్‌లో పోటీపరీక్షలకు కేంద్రమైన అశోక్‌నగర్ ప్రాంతంలో హాస్టల్ గదిలో ప్రవళిక అనే యువతి ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. ఉద్యోగాలు రాకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే యువతి బలవన్మరణానికి పాల్పడిందంటూ వందలాది మంది విద్యార్థులు, అభ్యర్థులు రోడ్లపైకి చేరి ఆందోళనకు దిగారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల మద్దతుతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Young Girl Hangs to Death at Hostel
Young Girl Hangs to Death at Hostel at Hyderabad
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 6:38 AM IST

Updated : Oct 14, 2023, 6:52 AM IST

పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న యువతి ఆత్మహత్య.. విద్యార్థుల ఆందోళనతో అర్థరాత్రి ఉద్రిక్తత

Young Girl Hangs to Death at Hostel at Hyderabad: పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న ఓ అభ్యర్థిని హైదరాబాద్‌లో ఆత్మహత్య(Young Girl Committed Suicide) కు పాల్పడటం కలకలం రేపింది. వరంగల్ జిల్లా బిక్కజిపల్లి మండలం పొనకల్​కు చెందిన మర్రి ప్రవళిక డిగ్రీ పూర్తి చేసింది. పోటీ పరీక్షలకు రాసేందుకు అశోక్‌నగర్ లోని ఓ కోచింగ్ సెంటర్‌లో చేరి శిక్షణ తీసుకుంటోంది. సమీపంలో ఉన్న బృందావన్ మహిళా వసతి గృహంలో అద్దెకు ఉంటోంది. 15 రోజుల క్రితమే ఈ హాస్టల్​లో చేరిన ప్రవళిక శుక్రవారం రాత్రి 8గంటల ప్రాంతంలో గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలన్మరణానికి పాల్పడింది.

గమనించిన రూమ్‌ మేట్స్ యజమానులకు సమాచారం అందించారు. అప్పటికే ప్రవళిక మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తుండగా ప్రవళిక మృతికి ప్రభుత్వమే కారణం అంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వందలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, అభ్యర్థులు.. ఉద్యోగ నియామకాల్లో జాప్యం జరగడం వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుందని నినాదాలు చేశారు. మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించకుండా అడ్డుకున్నారు. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

వసతి గృహం పైనుంచి పడి ఇంజినీరింగ్​ విద్యార్థిని మృతి

Student Suicide in Hostel at Ashok Nagar: అందోళన చేస్తున్న వారికి కాంగ్రెస్, బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ పోలీసుల వైఖరిపై మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు అనిల్‌కుమార్ యాదవ్, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నేతలు ఆందోళనకు మద్దతు పలికారు. ఒక దశలో ఆందోళన తీవ్ర ఉద్రిక్తలకు దారి తీయడంతో.. ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. విద్యార్థులు, రాజకీయ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. అయినప్పటికీ ఆందోళన ఉద్ధృతం కావడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసి.. ముషీరాబాద్ ఠాణాకు తలించారు. కాంగ్రెస్ నేతలు ఫిరోజ్‌ఖాన్‌, విజయారెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసుల దోమలగూడా పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

"నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఇచ్చిన నోటిఫికేషన్​లు ఈ రోజు ఏరకంగా లీకేజీల పేరు మీద యువత భ్రష్టు పట్టిపోతున్నారు. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేశారనే మనస్తాపంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఈ వార్త చాలా కలవరపరుస్తోంది. ప్రభుత్వము బాధ్యత తీసుకొని ఇప్పటికైనా యువతకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన విద్యార్థులకే.. ఇలాంటి స్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంపై స్పందించాలి." - కె.లక్ష్మణ్, రాజ్య సభ సభ్యుడు

నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు. వారిపై లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో కొందరు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఇద్దరు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. హైదరాబాద్ ఏఆర్ ఏసీపీ సత్యనారాయణ కనుబొమ్మలపై గాయమైంది. మరో సబ్‌ ఇన్పెక్టర్‌కి సైతం స్వల్ప గాయాలు అయ్యాయి. విద్యార్థులను చెదరగొట్టిన వెంటనే బృందావన్ హస్టల్​లో ఉన్న ప్రవళిక మృత దేహాన్ని భారీ భద్రత నడుమ గాంధీ అస్పత్రికి తరలించారు. ఘటనపై చిక్కడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని మధ్య మండల డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

Another death in Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని మృతి.. అసలేం జరుగుతోంది..?

B Tech student die: దారుణం.. తరగతి గదిలోనే అబార్షన్‌ కారణంగా విద్యార్థిని మృతి

Last Updated : Oct 14, 2023, 6:52 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.