తనకు కేబినెట్ ర్యాంకు వసతులు కేటాయిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బవసరాజ్ బొమ్మైను ఆ రాష్ట్ర మాజీ సీఎం యడియూరప్ప ఆదివారం కోరారు. ఈ మేరకు సీఎంకు ఓ లేఖ రాశారు.
"తాజా మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే వసతులను మాత్రమే నాకు కల్పించాలని మిమ్మల్ని(సీఎంను) కోరుతున్నాను. నాకు ఇచ్చిన కేబినెట్ ర్యాంకు హోదాను ఉపసంహరించుకోండి."
-యడియూరప్ప, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి
యడియూరప్పకు మంత్రులకు ఉండే వసతులు కల్పిస్తున్నట్లు బసవరాజ్ బొమ్మై శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
జులై 26న తన రెండేళ్ల పాలన పూర్తైన వేళ.. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప రాజీనామా చేశారు. ఆ మరుసటి రోజున బసవరాజ్ బొమ్మై పేరును భాజపా శాసనసభాపక్ష నేతగా యడియూరప్ప ప్రతిపాదించారు. అనంతరం జులై 28న బసవరాజ్ బొమ్మై.. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే 29 మంది సభ్యులతో ఆయన మంత్రివర్గ విస్తరణ చేశారు.
ఇదీ చూడండి: నాలుగు సార్లు సీఎం.. కానీ ఎన్నడూ ఐదేళ్లు ఉండలేదు