ETV Bharat / bharat

జపాన్ మ్యాంగోకు భారీ డిమాండ్.. కేజీ రూ.2.7లక్షలు.. సాగుకు రైతులు సిద్ధం - World most expensive Miyazaki Mango in india

వేసవి కాలం అంటే మనకు గుర్తొచ్చేది మండే ఎండలతో పాటు నోరూరించే మామిడి పళ్లు. బంగినపల్లి, రసాలు, నీలం, తోతాపురి లాంటి ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నప్పటికి ఇప్పుడో కొత్త రకం మామిడి మార్కెట్​లో సందడి చేస్తోంది. చూసేకి ఆకర్షించేంతగా, తింటే నోరూరించే రుచితో ఉండే ఈ మామిడి రేటు తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.

world-most-expensive-miyazaki-mango
world-most-expensive-miyazaki-mango
author img

By

Published : Nov 23, 2022, 12:32 PM IST

సాధారణంగా సీజన్​తో పాటు మార్కెట్​ డిమాండ్ బట్టి కిలో మామిడి రేటు రూ.100 నుంచి 200 రూపాయల వరకు ఉంటుంది. కానీ, ఈ కొత్తరకం మామిడి ధర వింటే మాత్రం షాక్​ తినాల్సిందే. కిలో మామిడి పండ్లు ఏకంగా రూ.2.7లక్షలు పలుకుతాయి.​ జపాన్‌కు చెందిన మియాజాకి నగరం పేరుతో సాగయ్యే ఈ మామిడి రకం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. గత సీజన్‌లోనే దీన్ని జపాన్‌లో కిలో రెండున్నర లక్షల రూపాయల చొప్పున విక్రయించారు. ఇంతటి ఖరీదైన మామిడిని ఇప్పుడు భారత్​, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్​తో పాటు ఫిలిప్పీన్స్‌లోనూ సాగు చేస్తున్నారు.

world-most-expensive-miyazaki-mango
మియాజాకి మామిడి మొక్క

ఈ రకానికి చెందిన ఒక్కో మామిడి పండు బరువు దాదాపు 330 గ్రాములు ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ బీటా-కెరోటిన్​తో పాటు ఫోలిక్ యాసిడ్ లక్షణాలను కలిగి ఉన్న ఈ పండులో చక్కెర 15 నుంచి 20 శాతం మాత్రమే ఉంటుంది. అందుకే ఈ పండు మరింత రుచిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్​లో ఓ రైతు తన తోటలోని ఈ రకం మామిడి సాగు చేశారు. పండ్ల దొంగతనాలను అరికట్టేందుకు నలుగురు కాపలాదారులను, శునకాలను పెట్టడం వల్ల ఈ మామిడి జాతి దేశమంతటా ట్రెండింగ్​ అయ్యింది.

world-most-expensive-miyazaki-mango
నర్సరీ నిర్వాహకుడు మహేంద్ర కుమార్​ గుప్తా

ఇప్పుడు జబల్​పుర్​లోనే కాకుండా ఇందోర్, భోపాల్‌తో సహా ఇతర ప్రాంతాలలో ఈ ఖరీదైన మామిడికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో రైతులు సైతం దీన్ని పండించటానికి మొగ్గు చూపిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఓ నర్సరీ నిర్వాహకుడు మహేంద్ర కుమార్​ గుప్తా..ఈ ఖరీదైన మామిడి నారులపై దాదాపు మూడేళ్లు పరిశోధన చేసి మొక్కలను సిద్ధం చేశారు. అంతే కాకుండా ఇందోర్‌లోని కొంతమంది రైతుల కోసం దీన్ని అందుబాటులో ఉంచారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.