రాజస్థాన్‌లో దారుణ హత్య (Rajasthan news today) జరిగింది. గేదెలను మేపేందుకు వెళ్లిన ఓ మహిళను కిరాతకంగా చంపాడు (Woman Murdered) ఓ దుండగుడు. గొడ్డలితో నరికి ప్రాణాలు తీశాడు. మృతి చెందిన మహిళ కాళ్లను నరికేసి.. వెండి కడియాలను దోచుకెళ్లాడు. జైపుర్‌లోని జమ్వా రామ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
మృతురాలిని ఖాతేపురాకు చెందిన గీతా దేవి(50)గా గుర్తించారు. మహిళ మెడపై పలుమార్లు గొడ్డలితో దాడి చేసినట్లు తెలుస్తోంది. మహిళ ఆభరణాలను తీసుకొని నిందితుడు పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. డీఎస్పీ లఖన్ సింగ్ మీనా సైతం ఆ ప్రాంతానికి వెళ్లారు. మృతదేహం పడి ఉన్న ప్రాంతం నుంచి ఆధారాలు సేకరించారు.
స్థానికుల డిమాండ్..
మరోవైపు, పట్టపగలే ఇలాంటి దారుణ హత్య జరగడంపై గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఘటనా స్థలికి పెద్ద ఎత్తున స్థానికులు తరలి వచ్చారు. నిందితులను త్వరగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: బస్సును కొట్టేసి పరారైన దొంగలు.. కానీ...